క్యారెట్ లేన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ : రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు అపహరణ
Monday, October 5, 2026
Diamond Jewellery Worth ₹2 Crore Stolen Major Theft at CaratLane Diamond Jewellery Shop Medchal-Malkajgiri district Medipally police station telangana
తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న క్యారెట్ లేన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్‌లో తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు షట్టర్‌ను వంచి దుకాణంలోకి చొరబడి, లోపల ఉన్న గ్లాస్‌ను పగలగొట్టి సుమారు రూ.2 కోట్లకు పైగా విలువైన వజ్రాభరణాలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. చోరీ జరిగిన విషయం తెలియడంతో మేడిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ మేడిపల్లి ఏసీపీ మోహన్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. క్లూస్ టీమ్, ఉప్పల్ జోన్ ఎస్‌వోటీ టీమ్ సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. దుండగులు ఏ మార్గంలో వచ్చారు, చోరీ అనంతరం ఏ దారిలో పరారయ్యారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిస్థిలిస్తున్నారు.
No comments:
Post a Comment