ఆసియా క్రీడలు 2026 : స్క్వాష్ లో రెండు కాంస్య పతకాలు
Thursday, October 1, 2026
2026 Asian Games both the Indian men's and women's teams were defeated 1-2 national semi-final clashes held today sports Two Bronze Medals in Squash
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత స్క్వాష్ జట్లు కాంస్య పతకాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి. ఈరోజు జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్ పోరుల్లో భారత పురుషుల, మహిళల జట్లు రెండూ 1-2 తేడాతో పరాజయం పాలై పసిడి రేసు నుంచి వైదొలిగాయి. పురుషుల జట్టు మలేషియా చేతిలో, మహిళల జట్టు హాంగ్‌కాంగ్ చేతిలో ఓటమి చవిచూసింది. గత ఎడిషన్‌లో స్వర్ణం సాధించి, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. మలేషియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అభయ్ సింగ్ తీవ్రంగా శ్రమించినప్పటికీ 8-11, 8-11, 8-11 తేడాతో ఎయిన్ యోన్గ్ చేతిలో ఓడిపోయాడు. కేవలం 22 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో మలేషియా క్రీడాకారుడు ఎయిన్ యోన్గ్ ఆధిపత్యం ప్రదర్శించి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం రంగంలోకి దిగిన వీర్ చోత్రాని భారత్‌కు ఆశలు చిగురింపజేశాడు. సంజయ్ జీవాపై 11-4, 11-8, 11-5 తేడాతో కేవలం 11 నిమిషాల్లోనే వరుస గేమ్‌ల్లో ఘనవిజయం సాధించాడు. దీంతో స్కోరు 1-1తో సమమై మ్యాచ్ నిర్ణయాత్మక ఘట్టానికి చేరుకుంది. కానీ చివరి పోరులో మలేషియా అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్ ఫైనల్ ఆశలు ఆవిరయ్యాయి. మరోవైపు మహిళల విభాగానికి సంబంధించి హాంగ్‌కాంగ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ కూడా భారత్‌కు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ప్రపంచ 17వ ర్యాంకర్ అనాహత్ సింగ్, హాంగ్‌కాంగ్‌కు చెందిన సిన్ యుక్ చాన్ (ప్రపంచ 25వ ర్యాంక్)ల నడుమ జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఆశించిన ఆరంభం లభించలేదు. కఠిన పోటీ నడుమ భారత్ 1-2 తేడాతో ఓటమి పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. స్వర్ణ పతకం సాధిస్తాయని భావించిన రెండు జట్లు కూడా సెమీస్ దాటలేకపోవడం క్రీడాభిమానులను కొంత నిరాశకు గురయ్యారు.
No comments:
Post a Comment