శ్రీసిటీలోని 'టిల్ హెల్త్ కేర్' ఫార్మా పరిశ్రమలో బాయిలర్ పేలుడు : ఐదుగురు కార్మికులు దుర్మరణం : 12 మందికి పైగా తీవ్రగాయాలు

السبت، 3 أكتوبر 2026

Andhra Pradesh Boiler Explosion at 'TIL Healthcare' Pharma Plant in Sri City Five Workers Killed Over 12 Seriously Injured Tirupati district

t f B! P L

ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శ్రీసిటీలోని 'టిల్ హెల్త్ కేర్' ఫార్మా పరిశ్రమలో బాయిలర్ పేలుడు ఘటనలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. రాత్రి సమయంలో విధుల్లో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరగడం కలకలం రేపింది. పరిశ్రమలో ఒక్కసారిగా బాయిలర్ పేలిపోవడంతో భారీ మంటలు చెలరేగాయి. రాత్రి షిఫ్ట్‌లో పనిచేస్తున్న కార్మికులు కొందరు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలైన మరికొందరిని స్థానికులు, అధికారులు వెంటనే రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కార్మిక శాఖ మంత్రి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు కార్మిక శాఖ మంత్రి సుభాష్ వెంటనే హుటాహుటిన ఘటనా స్థలికి బయలుదేరి వెళ్లారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇస్తూ.. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా నిబంధనలపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ