తెలంగాణ శాసనసభ స్పీకర్‌ను దూషించారన్న కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి రిమాండ్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. రూ. 10వేల పూచీకత్తుతో రెండు షూరిటీలను సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. షూరిటీలు సమర్పించిన తర్వాత ఎమ్మెల్సీలను విడుదల చేయాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరిని మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పీకర్ ఓఎస్డీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఇద్దరిని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, ఈ కేసుపై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డికి రిమాండ్ విధించేందుకు తిరస్కరించింది.
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డికి రిమాండ్ విధించేందుకు తిరస్కరించిన నాంపల్లి కోర్టు
الثلاثاء، 8 سبتمبر 2026
alleged verbal abuse of the Telangana Legislative Assembly Speaker Nampally Court Refuses to Remand MLCs Tata Madhu and Naveen Reddy telangana
ليست هناك تعليقات:
إرسال تعليق