జాజికాయ - ఆరోగ్య ప్రయోజనాలు

الثلاثاء، 1 سبتمبر 2026

helps improve heart health Nutmeg – Health Benefits reduce stress regulate blood sugar levels slightly pungent and astringent taste this spice has long been used as a natural remedy

t f B! P L

జాజికాయ కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు కూడా నిలయం. కొద్దిగా ఘాటు, వగరు రుచి కలిగిన ఈ మసాలా దినుసును పురాతన కాలం నుండి సహజ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. వానాకాలం లేదా చలికాలంలో వేధించే జలుబు, దగ్గును తగ్గించడంలో జాజికాయ ఎంతో బాగా పనిచేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఇది మేలు చేస్తుంది. కొద్దిగా జాజికాయ పొడిని గోరువెచ్చని పాలలో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, దగ్గు లక్షణాలు త్వరగా తగ్గుతాయి. ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలు, ముడతలతో బాధపడేవారికి జాజికాయ మంచి పరిష్కారం. జాజికాయ పొడిని పచ్చి పాలు లేదా రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. అయితే ఈ పేస్ట్‌ను ముఖంపై 10-12 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంచకూడదు. నేటి జీవనశైలిలో చాలామందిని వేధించే ప్రధాన సమస్య ఒత్తిడి, నిద్రలేమి. రాత్రి పడుకునే ముందు రెండు చిటికెల జాజికాయ పొడిని గోరువెచ్చని పాలలో కలిపి తాగితే మనస్సు ప్రశాంతంగా మారి మంచి నిద్ర పడుతుంది. ఇక ఇది మూడ్‌ను మెరుగుపరచి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు లేదా కండరాల వాపుతో బాధపడేవారికి జాజికాయ నూనె ఎంతో ప్రయోజనకరం. ఇక జాజికాయ పొడిని నువ్వుల నూనెతో కలిపి పేస్ట్‌లా చేసి నొప్పి ఉన్న చోట మర్దన చేస్తే నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. జాజికాయలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను, చిగుళ్ల నొప్పులను సమర్థవంతంగా నివారిస్తాయి. ఇక చిన్న జాజికాయ ముక్కను నోట్లో వేసుకుని నమలడం లేదా జాజికాయ నూనెను చిగుళ్లపై అప్లై చేయడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ