ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష తుది ఫలితాలు , ఫైనల్ ఆన్సర్ కీలను విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. గత నెలలో జరిగిన ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు లక్షలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రాథమిక కీపై అభ్యంతరాల పరిశీలన ముగిసిన అనంతరం ఫైనల్ స్కోర్ కార్డులను అధికారులు అందుబాటులో ఉంచారు. రాబోయే డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు అభ్యర్థులకు అత్యంత కీలకం. ఫలితాలు చెక్ చేసుకునేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in/ లింక్‌ను బ్రౌజర్‌లో ఓపెన్ చేయాలి. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ఉన్న ‘క్యాండిడేట్ లాగిన్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ రిజిస్టర్డ్ యూజర్ నేమ్ లేదా హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి. పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీని నిర్దిష్ట ఫార్మాట్‌లో ఎంటర్ చేయాలి. పక్కనే కనిపించే క్యాప్చా కోడ్‌ను సరిగ్గా టైప్ చేసి ‘లాగిన్’ బటన్ ప్రెస్ చేయాలి. యూజర్ ఐడీ లేదా పాస్‌వర్డ్ మర్చిపోయినవారు పేజీలోని రికవరీ ఆప్షన్ ద్వారా మొబైల్ లేదా ఈమెయిల్ సహాయంతో తిరిగి పొందవచ్చు.

Post a Comment

أحدث أقدم