తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెడు జరగాలని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదని, ఇకపై కూడా కోరుకోదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం పాడవ్వాలని ఎవరు కోరుకుంటున్నారని, ఆయన ద్వారా ఎవరు లబ్ధి పొందాలని చూస్తున్నారని ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ కోరుకుంటోందన్న ప్రచారాన్ని ఖండించారు. ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవించే సంస్కృతి కాంగ్రెస్‌దని స్పష్టం చేశారు. కేసీఆర్ గాయపడిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అధికారులను అప్రమత్తం చేసి కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారని, ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కూడా సూచించారని తెలిపారు. అలాంటి తమ పార్టీపై కేసీఆర్ ఆరోగ్యం విషయంలో నిందలు వేయడం సరికాదన్నారు. వారి ఇంటి గొడవలను కాంగ్రెస్‌కు ఆపాదిస్తున్నారు' అంటూ వ్యాఖ్యానించారు.
కేసీఆర్‌కు చెడు జరగాలని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదని, ఇకపై కూడా కోరుకోదు: మహేష్ కుమార్ గౌడ్
الأربعاء، 9 سبتمبر 2026
Congress never wished ill upon KCR Mahesh Kumar Goud nor will it ever do so Speaking to the media telangana They are attributing their own internal family disputes to the Congress
ليست هناك تعليقات:
إرسال تعليق