ఎర్రవల్లిలో అసైన్డ్‌ భూములపై క్షేత్రస్థాయి సర్వే చేపట్టిన అధికారులు

Friday, September 18, 2026

Officials Conduct Field Survey of Assigned Lands in Erravalli survey in five teams under the supervision of AD Sudarshan Rathod and DI Sevia Naik telangana

t f B! P L

తెలంగాణలోని ఎర్రవల్లిలో భూ సర్వే వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 325లో ఉన్న 388 ఎకరాల అసైన్డ్‌ భూములపై అధికారులు క్షేత్రస్థాయి సర్వే చేపట్టారు. అసైన్డ్‌ భూములు కబ్జాకు గురయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ సర్వేకు ప్రాధాన్యం ఏర్పడింది. ఏడీ సుదర్శన్‌ రాథోడ్‌, డీఐ సేవియా నాయక్‌ ఆధ్వర్యంలో ఐదు బృందాలుగా అధికారులు సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. సర్వే నంబర్‌ 325 పరిధిలోని ప్రభుత్వ భూములను మాత్రమే గుర్తించి, వాటి హద్దులు, విస్తీర్ణం, ప్రస్తుత ఆధీనంపై వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన 388 ఎకరాల అసైన్డ్‌ భూములు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉన్నాయి? వాటి హద్దులు, విస్తీర్ణం రికార్డులతో సరిపోతున్నాయా? ప్రస్తుతం ఆయా భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? అనే అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. సర్వే పూర్తయిన అనంతరం ప్రభుత్వ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితికి మధ్య ఉన్న వ్యత్యాసాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహారం ఎర్రవల్లిలో చర్చనీయాంశంగా మారడంతో పాటు రాజకీయంగానూ చర్చాంశనీయంగా మారింది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ