ホーム
/
technology
/
తక్కువ నాణ్యత కలిగిన స్క్రీన్ ప్రొటెక్టర్లు, స్క్రీన్ గార్డులపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం : వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలు
Tuesday, September 22, 2026
business Central Government bans low-quality screen protectors and screen guards implementation begins next April national smart phones technology
మొబైల్ ఫోన్ లకు ఉపయోగించే తక్కువ నాణ్యత కలిగిన స్క్రీన్ ప్రొటెక్టర్లు, స్క్రీన్ గార్డులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలు కానుంది. దీనిపై తాజాగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. తగిన ప్రమాణాలు పాటించని వాటిపై ఈ నిషేధం వర్తిస్తుంది. ఈ మేరకు స్క్రీన్ ప్రొటెక్టర్లను కూడా కేంద్రం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (బీఐఎస్) కిందకు తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లు తయారు చేసే సంస్థలు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బీఐఎస్ రూపొందించిన నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. వచ్చే ఏప్రిల్ 1 నుంచి విక్రయించబోయే స్క్రీన్ గార్డులు ఈ నాణ్యతను కలిగి ఉండాలి. కేంద్రం రూపొందించిన రూల్స్ ప్రకారం ప్రతి గ్లాస్ తగిన నాణ్యత కలిగి ఉండాలి. అలాగే, స్క్రీన్ విజిబుల్‌గా ఉండాలి. ప్యాకేజింగ్‌కు సంబంధించిన వివరాలు ఉండాలి. బ్లూ లైట్ ఫిల్టరింగ్, యాంటీ గ్లేర్, ప్రైవసీ వంటి ఫీచర్లు కలిగి ఉండాలి. ఈ నిర్ణయం అమలైతే వినియోగదారులకు క్వాలిటీ కలిగిన మొబైల్ స్క్రీన్ గార్డులు మాత్రమే మార్కెట్‌లో లభిస్తాయి.
No comments:
Post a Comment