స్నాప్‌చాట్‌లో సరికొత్త ఫీచర్‌ "స్నాప్‌చాట్ ప్లాన్స్"

స్నాప్‌చాట్ యూజర్ల కోసం ఒక సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈవెంట్‌లను ప్లాన్ చేసుకోవడానికి, ఆహ్వానాలు పంపుకోవడానికి వీలుగా "స్నాప్‌చాట్ ప్లాన్స్" పేరుతో కొత్త ఫీచర్ల సమితిని శుక్రవారం రోజున అధికారికంగా ప్రారంభించింది. యాప్‌లోని గ్రూప్ చాట్‌ల ద్వారా యూజర్లు రియల్-లైఫ్ ఈవెంట్‌లను ప్లాన్ చేసుకుంటున్నారని గమనించిన స్నాప్‌చాట్, ఆ ప్రాసెస్ మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. స్నాప్‌చాట్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. 13 నుంచి 24 ఏళ్ల వయస్సు ఉన్న యూజర్లలో దాదాపు 35 శాతం మంది నిజ జీవితంలో నిర్వహించే వేడుకలు, మీటప్‌లు, ఇతర కార్యక్రమాలను ప్లాన్ చేయడానికి స్నాప్‌చాట్ గ్రూప్ చాట్‌లనే ఉపయోగిస్తున్నారు. యూజర్ల ఈ అలవాటును ఆసరాగా చేసుకుని స్నాప్‌చాట్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు ఒకే చోట నుండి మ్యూచువల్ ఫ్రెండ్స్‌కు ఈవెంట్ ఇన్విటేషన్లు పంపవచ్చు. అలాగే ఈవెంట్ తేదీ, సమయం, హాజరయ్యే వ్యక్తుల వివరాలను ట్రాక్ చేయడంతో పాటు ఈవెంట్‌ల వివరాలన్నీ యాప్‌లో ఒకే చోట సులభంగా చూసుకోవచ్చు. అంతేకాకుండా, త్వరలోనే నేరుగా చాట్ విండో నుంచే కొత్త ఈవెంట్‌ను క్రియేట్ చేసుకునే సదుపాయాన్ని కూడా అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. స్నాప్‌చాట్‌లో ఒక ప్లాన్ క్రియేట్ చేయడానికి ముందుగా ఈవెంట్‌కు ఒక టైటిల్ ఇచ్చి, తేదీ , సమయాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిపి దాదాపు 200 మంది వరకు యూజర్లకు ఒక్కసారిగా ఇన్విటేషన్లు పంపవచ్చు. ప్లాన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడానికి బిట్‌మోజీ కవర్ ఆర్ట్‌ను కూడా యాడ్ చేయవచ్చు, ఇది ఈవెంట్ ముందుకు సాగుతున్న కొద్దీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. ఇన్విటేషన్లు అందిన యూజర్లు చాట్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా నేరుగా ప్లాన్‌కే గోయింగ్, మేబీ, లేదా కాంట్ గో అని ఆర్‌ఎస్‌విపి ద్వారా తమ సమాధానం తెలియజేయవచ్చు. యూజర్లు తమ ఈవెంట్‌లను సులభంగా మేనేజ్ చేయడానికి స్నాప్‌చాట్‌లో "మై ప్లాన్స్" అనే కొత్త సెక్షన్ జోడించారు. ఇందులో క్రియేట్ చేసిన లేదా ఆహ్వానం వచ్చిన ప్రస్తుత, రాబోయే , పాత ప్లాన్స్‌ను బ్రౌజ్ చేయవచ్చు. అలాగే ఇతర యూజర్లతో ఉన్న మ్యూచువల్ ప్లాన్స్‌ను "అవర్ ప్లాన్స్" సెక్షన్‌లో చూడవచ్చు. ప్లాన్ క్రియేట్ చేసిన తర్వాత కూడా వివరాలను మార్చుకునే వెసులుబాటు ఉంది. ఇక ఈవెంట్ ప్రారంభానికి సరిగ్గా 1 గంట ముందు స్నాప్‌చాట్ ప్లాన్స్ యూజర్లకు నోటిఫికేషన్ ద్వారా రిమైండర్ పంపుతుంది. యాప్‌లోనే ఈవెంట్ ప్లానింగ్ మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తెస్తూ స్నాప్‌చాట్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Post a Comment

0 Comments