దేశీయ మార్కెట్‌లోకి బ్రావ్ ఆర్క్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ అడుగుపెట్టింది. కేవలం ట్యాబ్ మాత్రమే కాకుండా, దీంతో పాటు స్టైలిష్ పెన్ , బ్లూటూత్ కీబోర్డ్ కాంబో వస్తుండటం దీనికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆఫీస్ వర్క్, ఆన్‌లైన్ క్లాసులు లేదా క్రియేటివ్ డిజైనింగ్ కోసం ఒకే డివైజ్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. దీని ధర రూ. 42,999. ఈ ట్యాబ్ చూడటానికి ఎంతో స్లీక్‌గా, ప్రీమియం లుక్‌లో వస్తుంది. దీని పెద్ద స్క్రీన్ వీడియోలు చూసేటప్పుడు, గేమింగ్ సమయంలో కూడా మంచి విజువల్ ఫీల్ ఇస్తుంది. ఆన్‌లైన్ మీటింగ్‌లు అటెండ్ అయ్యే వారికి, సినిమాలు చూసే వారికి ఈ డిస్‌ప్లే క్వాలిటీ చాలా బాగా నచ్చుతుంది. ఈ ప్యాకేజ్‌లో లభించే స్టైలస్ పెన్ ఆర్టిస్టులకు, నోట్స్ రాసుకునే విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. పెన్‌తో రాసేటప్పుడు పేపర్ మీద రాసినంత సహజమైన అనుభవం కలుగుతుంది. దీంతో పాటు వచ్చే బ్లూటూత్ కీబోర్డ్ ఈ టాబ్లెట్ ను ఇన్‌స్టంట్‌గా మినీ ల్యాప్ టాప్‌లా మార్చేస్తుంది. టైపింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్‌గా పని చేస్తుంది. ఈ ట్యాబ్‌లో పవర్ ఫుల్ ప్రాసెసర్‌ను అందించారు. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఎలాంటి లాగ్ సమస్యలు లేకుండా ఇది చాలా వేగంగా పని చేస్తుంది. ఒకే సమయంలో రకరకాల యాప్స్ ఓపెన్ చేసినా సిస్టమ్ స్మూత్‌గా రన్ అవుతుంది. అలాగే ఇందులో.. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.
ホーム
/
technology
/
బ్రావ్ ఆర్క్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ విడుదల : స్టైలిష్ పెన్ , బ్లూటూత్ కీబోర్డ్ కాంబో ఉచితం
Saturday, September 19, 2026
Brav Arc Android Tablet Launched Free Stylus Pen and Bluetooth Keyboard Combo t is an ideal device for those seeking a single solution for office work technology
No comments:
Post a Comment