ఇరాన్‌ ప్రభుత్వం నిర్వహించిన 'జన్ఫదా-యే ఇరాన్‌' : ఆయుధాలతో మహిళలు భారీ ర్యాలీ

Saturday, September 19, 2026

'Janfada-ye Iran' Organized by the Iranian Government A Massive Rally Featuring Armed Women hijab-clad women participated in a military-style march carrying rifles international

t f B! P L

రాన్‌లోని టెహ్రాన్‌ వీధుల్లో  హిజాబ్‌ ధరించిన మహిళలు రైఫిళ్లు చేతబట్టి సైనిక కవాతులో పాల్గొనడం, వేలాది మంది సైనిక దుస్తుల్లో ర్యాలీ చేయడం, డ్రోన్లు, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్‌ వ్యవస్థలను ప్రదర్శించడం ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.  దేశ రక్షణ కోసం సాధారణ పౌరులను కూడా సిద్ధం చేస్తున్నామని ఇరాన్‌ ప్రభుత్వం చూపించాలనుకుంటోంది. సెప్టెంబర్‌ 18న టెహ్రాన్‌లో జరిగిన ఈ భారీ కార్యక్రమానికి 'జన్ఫదా-యే ఇరాన్‌' అని పేరు పెట్టారు. దాదాపుగా 'ఇరాన్‌ కోసం త్యాగం చేసేవారు' అనే అర్థం వచ్చే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఇరాన్‌ అధికారుల ప్రకారం రాజధానిలో 3,13,000 మంది పాల్గొన్నారు. ర్యాలీ కేవలం ప్రదర్శనకే పరిమితం కాలేదు. పౌరులను పరిమిత సైనిక, అత్యవసర పరిస్థితుల శిక్షణకు సిద్ధం చేసే కార్యక్రమాన్ని కూడా ఇరాన్‌ ప్రారంభించింది. టెహ్రాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కమాండర్‌ జనరల్‌ హసన్‌ హసన్‌జాదెహ్‌ ప్రకారం 6 లక్షల మందికి పైగా ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య 10 లక్షలకు పైగా చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ , దాని వాలంటీర్‌ విభాగమైన బసీజ్‌ బలగాలకు అదనపు భద్రతా వ్యవస్థగా ఈ వాలంటీర్లను ఉపయోగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. అసాల్ట్‌ రైఫిళ్లతో ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నట్లు ఇరాన్‌ మీడియా ప్రచారం చేసింది. ఈ ర్యాలీలో మహిళల పాల్గొనడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన మహిళా సభ్యులు నల్లటి హిజాబ్‌లు ధరించి రైఫిళ్లతో కనిపించారు. మరికొందరు మహిళలు, యువత ప్రత్యేక విభాగాల్లో కవాతు చేశారు. దీంతో యుద్ధ సమీకరణాల్లో మహిళలను కూడా దేశ రక్షణలో భాగంగా చూపించే ప్రయత్నం స్పష్టంగా కనిపించింది. ర్యాలీలో సైనిక సామగ్రిని కూడా ప్రదర్శించారు. డ్రోన్లు, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్‌ బ్యాటరీలు, ఇతర ఆయుధ వ్యవస్థలను ప్రజలకు చూపించారు. ఇరాన్‌ సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించడంతో పాటు.. దేశంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న వాతావరణాన్ని చూపించడమే దీని ఉద్దేశంగా కనిపిస్తోంది. ర్యాలీలో కొందరు అమెరికా, ఇజ్రాయెల్‌ జెండాలను తొక్కుతూ నిరసన వ్యక్తం చేశారు. "డెత్‌ టు అమెరికా", "డెత్‌ టు ఇజ్రాయెల్‌" అంటూ నినాదాలు చేశారు. అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌, సైనికాధికారులు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బసీజ్‌ కొత్త అధిపతి హొస్సేన్‌ తాయెబ్‌ మాట్లాడుతూ.. శిక్షణ పొందే వాలంటీర్లు "పూర్తిస్థాయి రక్షణ"కు సిద్ధంగా ఉంటారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను ఇతర నగరాల్లోనూ నిర్వహిస్తామని ప్రకటించారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ