మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నాగిన్ ఖురెల్సుఖ్ తన అద్భుత వర్కౌట్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు. అది కూడా ఎలాంటి జిమ్ దుస్తులు లేకుండా ఫార్మల్ దుస్తుల్లోనే బరువులు ఎత్తే ఫీట్ చేయడం విశేషం. గతంలో ఆర్మీ అధికారిగా పనిచేసిన ఈయన సైనిక విభాగం సందర్శనలో భాగంగా ఈ ఫీట్‌ని చేశారు. అక్కడ ఆయన ఏకంగా వంద కిలోల బరువుని సూట్ జాకెట్ తొలగించి ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 20సార్లు బెంచ్ ప్రెస్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లంత అధ్యక్షుడి బలం, ఫిట్‌నెస్‌కి ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ వైరల్ వీడియో ఖరెల్సుఖ్ ఫార్మల్ సూట్ ధరించి బరువులు ఎత్తే బెంచ్ పక్కన నిలబడం చూడొచ్చు. కాసేపటి తర్వాత తన చుట్టూ ఉన్నవారు చూస్తుండగానే జాకెట్ తీసివేసి బెంచ్‌పై పడుకున్నారు. ఆ తర్వాత సుమారు వంద కిలో బెంచ్ ప్రెస్ చేయడం ప్రారంభిస్తారు. ఎటువంటి ఇబ్బందీ లేకుండా సుమారు 20 రిపిటేషన్లు అత్యంత సునాయాసంగా చేసేశారు'. కాగా ఈ మంగోలియా నాయకుడు 2021 నుంచి దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అధ్యక్ష పదవిని చేపట్టడానికి ముందు ప్రధానమంత్రితో సహా పలు కీలక రాజకీయ పదవులను అలంకరించారు. అలాగే ఆయనకు బాడీబిల్డింగ్, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం ఉంది. తన రాజకీయ జీవితాన్ని ప్రారంభిచడానికి ముందు మంగోలియన్ పీపుల్స్ ఆర్మీలో కూడా పనిచేశారు.
ホーム
/
Video goes viral
/
మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నాగిన్ ఖురెల్సుఖ్ తన అద్భుత వర్కౌట్ ప్రదర్శన : వీడియో నెట్టింట వైరల్
الجمعة، 11 سبتمبر 2026
former army officer he undertook this activity during a visit to a military facility international Mongolian President Ukhnaagiin Khurelsukh's impressive workout display Video goes viral
ليست هناك تعليقات:
إرسال تعليق