జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా ఆదివారం తన బస చేస్తున్న క్రూయిజ్ షిప్‌లో భారత అథ్లెట్ వరుణ్ సన్యాల్ స్పృహ తప్పి పడిపోయినట్లు ఎంఎంఏ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు నిఖిల్ కుందేరా వెల్లడించారు. నేపాల్‌కు చెందిన అథ్లెట్ వరుణ్ సన్యాల్‌ను గమనించి సమాచారం ఇవ్వడంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉంది. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌తో లేకపోవడంతో వరుణ్ సన్యాల్ క్వార్టర్ ఫైనల్ నుంచి డిస్‌క్వాలిఫై అయినట్లు సమాచారం. భారత్ నుంచి ఆసియా క్రీడల మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ జట్టులో ఎంపికైన ఇద్దరు క్రీడాకారుల్లో వరుణ్ సన్యాల్ ఒకడు. 2026 జనవరిలో చైనాలో జరిగిన ఆసియా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో వరుణ్ కాంస్య పతకం సాధించాడు. దీంతో ఆసియా క్రీడల్లో అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అనూహ్యంగా అనారోగ్య కారణాలతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
క్రూయిజ్ షిప్‌లో స్పృహ తప్పి పడిపోయిన భారత అథ్లెట్ వరుణ్ సన్యాల్ : క్వార్టర్ ఫైనల్ నుంచి డిస్‌క్వాలిఫై
الأحد، 20 سبتمبر 2026
Asian Games disqualified from quarter-finals Indian athlete Varun Sanyal collapses on cruise ship Mixed Martial Arts sports
ليست هناك تعليقات:
إرسال تعليق