రియల్ ఎస్టేట్ బ్రోచర్‌లో చూపించిన సౌకర్యాలను కచ్చితంగా కొనుగోలుదారులకు అందించాల్సిందేనని, వాటిని కేవలం మార్కెటింగ్ ప్రచారాలుగా చెప్పి తప్పించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ డీఎల్‌ఎఫ్ చేపట్టిన ది ప్రైమస్ ప్రాజెక్టుకు సంబంధించిన విచారణలో ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రకటనల ఆధారంగా జీవితకాల కష్టార్జితాన్ని ఇన్వెస్ట్ చేసే సామాన్య కొనుగోలుదారులను మోసం చేయడం తీవ్రమైన విషయమని బెంచ్ పేర్కొంది. గురుగ్రామ్‌లోని హౌసింగ్ ప్రాజెక్టులో బ్రోచర్‌లో హామీ ఇచ్చినట్లుగా 24 మీటర్ల రోడ్డును నిర్మించలేదని, ప్రధాన మార్గాన్ని సరిగ్గా అందుబాటులోకి తేలేదని కొనుగోలుదారులు వినియోగదారుల ఫోరాన్ని, అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రోడ్డు కేటాయించిన స్థలంలో మూడింట రెండు వంతుల భాగం పార్కింగ్‌కు, గ్రీనరీకి ఉపయోగించినట్లు కోర్టు నియమించిన సీబీఐ దర్యాప్తు బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించి నివేదిక సమర్పించింది. ప్లాన్ , బ్రోచర్‌లో ఉన్న సౌకర్యాలకు, క్షేత్రస్థాయి నిర్మాణానికి పొంతన లేకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. ఈ క్రమంలో డీఎల్‌ఎఫ్ ప్రాజెక్టులో చోటుచేసుకున్న ఈ మార్పులు చిన్నవేమీ కావు అని తేల్చిచెప్పిన ధర్మాసనం, బ్రోచర్‌కు అనుగుణంగా ప్రాజెక్టును తక్షణమే సవరించాలని హెచ్చరించింది. ఒకవేళ తదుపరి విచారణ నాటికి ప్రాజెక్టును ఒరిజినల్ ప్లాన్ ప్రకారం సరిదిద్దకపోతే కఠిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా, దీనిపై పూర్తిస్థాయి నివేదిక కోసం సీబీఐ దర్యాప్తు బృందానికి అదనపు అధికారులను కేటాయిస్తూ, కేసాన్ని అక్టోబర్ 12కు వాయిదా వేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో బ్రోచర్లలో అద్భుతమైన ప్లాన్‌లు చూపి, నిర్మాణం పూర్తయ్యాక వాటిని ఎత్తివేయడం సాధారణమైపోయిందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
బ్రోచర్‌లో చూపించిన సౌకర్యాలను కచ్చితంగా కొనుగోలుదారులకు అందించాలి !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق