నందిగ్రామ్ బరి నుంచి తప్పుకున్న టీఎంసీ అభ్యర్థి సంచితా ప్రధాన్ : కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన మమతా బెనర్జీ

Friday, September 18, 2026

Mamata Banerjee announces support for the Congress candidate national TMC candidate Sanchita Pradhan withdraws from the Nandigram contest West Bengal By-elections

t f B! P L

శ్చిమ బెంగాల్‌లో జరగనున్న ఉప ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉప ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే నందిగ్రామ్ ఉప ఎన్నిక బరి నుంచి టీఎంసీ అభ్యర్థి సంచితా ప్రధాన్ అనూహ్యంగా తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. బెంగాల్‌ సీఎం సువేందు అధికారితో సమావేశమైన అనంతరం సంచితా ప్రధాన్ పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. బీజేపీ నేతలతో భేటీ తర్వాతే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తన అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకోవడంపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాలను అంతం చేయాలనే ఆలోచనతోనే బీజేపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని ఆమె మండిపడ్డారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే పార్టీని చీల్చినట్టే, ఇప్పుడు తన పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని, తన వర్గం నుంచి ఎవరూ బరిలో నిలవకుండా బీజేపీ అడ్డుకుందని దీదీ విమర్శించారు. నందిగ్రామ్ ఉప ఎన్నికలో ఇక తమ పార్టీ నుంచి ఎవరినీ బరిలోకి దించబోమని మమత స్పష్టం చేశారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా తాము కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశం నుంచి బీజేపీని వెళ్లగొట్టేందుకే 'ఇండియా' కూటమితో కలిసి పనిచేస్తామని ఆమె పునరుద్ఘాటించారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌తో పాటు రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి.

Total Pageviews

Search This Blog

AsSencse 2

About Us

AP TO TG COMPUTER TECH

ver-1

1

Contact Form

No Thumbnail

LATEST NEWS AP TO TG
LATEST NEWS AP TO TG

#Tech

Tech

#Smartphone

Smartphone

Categories

Random Post

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ