ముంబై కోస్టల్ రోడ్ బ్రిడ్జిపై వెళ్తున్న ఓ బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పి బ్రిడ్జి పైనుంచి కిందకు పడిపోవడంతో ముగ్గురు చనిపోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం 5.20 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కారు మరైన్ డ్రైవ్ నుంచి హాజీ అలీ వెపు వెళ్తుండగా వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, దీంతో కారు బ్రిడ్జి గోడను ఢీకొని కిందకు పడిపోయిందని కోస్టల్ రోడ్ కంట్రోల్ రూం అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న నలుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, అప్పటికే వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ముంబై కోస్టల్ రోడ్ బ్రిడ్జిపై వేగ పరిమితి 11 కిలోమీటర్లు. దక్షిణ ముంబైలోని మరైన్ డ్రైవ్‌ను బాంద్రా వర్లీ సీ లింక్‌కు చెందిన వర్లీతో కలుపుతుంది.
ముంబై కోస్టల్ రోడ్ బ్రిడ్జి పైనుంచి అదుపు తప్పి కింద పడిపోయిన కారు : ముగ్గురు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
Sunday, September 20, 2026
Car Plunges Off Mumbai Coastal Road Bridge After Losing Control maharashtra One Critically Injured road connects Marine Drive in South Mumbai to Worli Three dead which links to the Bandra-Worli Sea Link
No comments:
Post a Comment