బలూచిస్తాన్ లో ఫుట్‌బాల్ క్రీడాకారుల బస్సును దోపిడీ చేసిన దుండగులు
الثلاثاء، 29 سبتمبر 2026
and other valuables assailants looted their cash group of 12 armed individuals intercepted it international Miscreants Rob Football Players' Bus in Balochistan mobile phones pakistan
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ పరిధిలో ఫుట్‌బాల్ క్రీడాకారుల బస్సును దుండగులు దోపిడీ చేశారు. కరాచీ ఫుట్‌బాల్ టీం అయిన కరాచీ డిస్ట్రిక్ట్ వెస్ట్ స్క్వాడ్ జట్టుకు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారులు క్వెట్టాలో జరుగుతున్న సీఎం గోల్డ్ కప్ కోసం బస్సులో బయల్దేరారు. మస్తుంగ్-సరియాబ్ మార్గంలో వెళ్తుండగా సోమవారం ఉదయం ఆయుధాలు కలిగిన 12 మంది బస్సును అడ్డగించారు. తుపాకులతో బెదిరించి క్రీడాకారుల దగ్గరున్న డబ్బు, మొబైల్స్, ఇతర విలువైన వస్తువుల్ని దోచుకెళ్లారు. క్రీడాకారుల దుస్తులు విప్పించి, కొంతమందిపై దాడిచేశారు. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
ليست هناك تعليقات:
إرسال تعليق