వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నిక : ఓటరు నమోదు షెడ్యూల్ విడుదల

الثلاثاء، 29 سبتمبر 2026

draft voter list will be published on November 25 submitted by November 6 telangana Voter Registration Schedule Released Warangal-Khammam-Nalgonda Graduates' Election

t f B! P L

తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరు నమోదు,కొత్త ఓటర్ల జాబితాకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి బి .చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వరంగల్ -ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ఓటరు జాబితాపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు నమోదు నోటిఫికేషన్ షెడ్యూల్ ఈనెల 28న విడుదల చేయడం జరిగిందని. దినపత్రికలతో పాటు, జిల్లా కలెక్టర్, ఏ ఈ ఆర్వో కార్యాలయాలలో ప్రచురించినట్లు తెలిపారు. అక్టోబర్ 15 న, తిరిగి అక్టోబర్ 25 న మరోసారి దినపత్రికలలో ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. వరంగల్- ఖమ్మం- నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం -18 లో నవంబర్ 6 లోగా దరఖాస్తు చేసుకోవాలని, నవంబర్ 25 న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని, ముసాయిదా ఓటరు జాబితా పై నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని, డిసెంబర్ 25న అభ్యంతరాల పరిష్కారం ఉంటుందని, డిసెంబర్ 30 న తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వరంగల్- ఖమ్మం -నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నిక 12 జిల్లాల పరిధిలోకి వస్తుందని , నల్గొండ అడిషనల్ కలెక్టర్ ఈ ఎన్నికలకు ఎలాక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా (ఈ ఆర్ ఓ) గా వ్యవహరిస్తారని, సబ్ కలెక్టర్లు, ఆర్డిఓ, తహసిల్దార్లు ఏఈఆర్వోలుగా వ్యవహరిస్తారని వెల్లడించారు. ఈ ఎన్నికలలో ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే వారు ఫారం 18 లో నమోదు చేసుకోవాలని ,ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని , అయితే ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ఓటర్లను ప్రోత్సహించాలని ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కోరారు. ఈ ఎన్నికలకు మొత్తం నియోజకవర్గం వారిగా 605 పోలింగ్ కేంద్రాలు ఉండగా, నల్గొండ జిల్లాలో 97 ఉన్నాయని, అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 2024 ఎన్నికలలో ఓటు హక్కు ఉన్నవారు కూడా ఇప్పుడు కొత్తగా ఓటరు గా నమోదు చేసుకోవాలని, ఓటరు నమోదుకు పారం- 18 తో పాటు, తప్పనిసరిగా సొంత ధ్రువీకరణ తో పాటు,గజిటెడ్ అధికారి చే ధ్రువీకరణ సమర్పించాలని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఓటరు గా నమోదయ్యేందుకు నిర్దేశించిన తేదీ నవంబర్ 1 ,2026 కు మూడేళ్ల ముందు డిగ్రీ పూర్తి చేసి ఉండాలని, ఈ నియోజకవర్గ నివాసి అయి ఉండాలని వెల్లడించారు.గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటరు గా నమోదుకు జిల్లాలో ఇప్పటివరకు 3565 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఎక్కువ మంది ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం కల్పించడం జరుగుతుందని, అలాగే మున్సిపల్ వాహనాల ద్వారా ప్రచారం కల్పిస్తామని తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ )పై కలెక్టర్ మాట్లాడుతూ డాక్యుమెంట్ల పరిశీలన కార్యక్రమం కొనసాగుతున్నదని, ఇంకా 72,000 డాక్యుమెంట్స్ పరిశీలించాల్సి ఉందని తెలిపారు. బిఎల్ఓ లు అవసరమైన దృవపత్రాలను స్వీకరిస్తున్నారని, పరిశీలన కార్యక్రమాన్ని ఈ వారంలో పూర్తి చేస్తామని , సర్ లో భాగంగా ఓట్లను తొలగించడం జరుగుతుందన్న అపోహలను నమ్మవద్దని ఆయన తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ