అదనపు కట్నం వివాదంలో భార్య ముక్కు కొరికేసిన భర్త

الأربعاء، 16 سبتمبر 2026

crime Husband bites off wife's nose during dispute over additional dowry Kotapalli Mandal of Mancherial district telangana

t f B! P L

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం తీవ్రరూపం దాల్చడంతో, కోపోద్రిక్తుడైన భర్త విచక్షణ కోల్పోయి భార్య ముక్కును గట్టిగా కొరికేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కోటపల్లి మండల కేంద్రానికి చెందిన మమతకు, అదే మండలం మల్లంపేటకు చెందిన ఎనగందుల మణిచందర్‌తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్లు సజావుగానే సాగిన వీరి సంసారంలో అదనపు కట్నం చిచ్చు రేపింది. గత నాలుగేళ్లుగా మణిచందర్ అదనపు కట్నం కోసం భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. దీనికి తోడు మద్యానికి బానిసకావడంతో ఇంట్లో తరచూ గొడవలు నిత్యకృత్యంగా మారాయి. మణిచందర్ వేధింపులు తాళలేక, విసిగిపోయిన మమత పది రోజుల క్రితం తన పిల్లలతో సహా కోటపల్లిలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది. మణిచందర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అత్తగారింటికి వెళ్లి మళ్లీ గొడవకు దిగాడు. ఈ క్రమంలో మమత తండ్రి నారాయణపై దాడికి ప్రయత్నించగా, తండ్రిని కాపాడుకునేందుకు మమత అడ్డుగా వెళ్లింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మణిచందర్ఆ మె ముక్కును బలంగా కొరికేసాడు. భర్త రాక్షసత్వంతో ముక్కు తెగిపడి మమత రక్తం మడుగులో అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కోటపల్లి ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ