నేపాల్‌లో బుధవారం తెల్లవారుజామున వరుసగా రెండుసార్లు భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదు. మూడు గంటల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. తొలి భూకంపం రిక్టర్‌ స్కేలుపై 4.5 తీవ్రతతో, రెండోది 4.2 తీవ్రతతో నమోదైంది. నేషనల్‌ సిస్మోలాజికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:51 గంటలకు తొలి భూకంపం నమోదైంది. దీని తీవ్రత 4.5గా నమోదైనట్లు వెల్లడించింది. అనంతరం మూడు గంటల్లోపే మరోసారి భూమి కంపించింది. ఉదయం 4:28 గంటలకు 4.2 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. దీని కేంద్రం కూడా ముగు జిల్లాలోని కలీయీ ప్రాంతం పరిసరాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు పొరుగున ఉన్న డోల్పా, జుమ్లా జిల్లాలనూ తాకాయి.

Post a Comment

أحدث أقدم