'ఫ్లైదుబాయ్' విమానం కాక్‌పిట్‌లో కొట్లాడుకున్న పైలట్లు !

الأربعاء، 30 سبتمبر 2026

from Dubai international Israel Pilots Brawl in 'flydubai' Cockpit report by The Times of Israel sparked a major incident Tel Aviv UAE

t f B! P L

యూఏఈలోని దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన 'ఫ్లైదుబాయ్' విమానంలో పైలట్ల మధ్య తలెత్తిన వివాదం పెను సంచలనానికి దారితీసింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానం అత్యవసర సంకేతాలను జారీ చేయడంతో ఏవియేషన్ వర్గాల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా,ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం విమానం గాల్లో ఉండగానే మొదట అంతర్జాతీయ అత్యవసర సంకేతాన్ని జారీ చేసింది. అయితే ఆ వెంటనే ఆ కోడ్ కాస్తా విమానం హైజాక్‌కు గురైనట్లు తెలిపే ప్రమాదకరమైన 'హైజాక్ కోడ్'కి మారింది. ఈ అత్యవసర సంకేతం వెలువడే కేవలం రెండు నిమిషాల ముందే, విమానం అకస్మాత్తుగా సుమారు 17,400 అడుగుల మేర కిందకి దిగడం గగనతలంలో తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. విమానం నుంచి '7500' స్క్వాక్ కోడ్ ప్రసారం కావడంతో ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది. వెంటనే ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఆ వాణిజ్య విమానం వైపు దూసుకెళ్లాయి. ఫ్లైట్‌రాడార్24 ఫుటేజ్ ప్రకారం.. టెల్ అవీవ్‌కు వెళ్లాల్సిన ఆ విమానం, జోర్డాన్ గగనతలంలోకి దూసుకెళ్లి, ఆపై ఇజ్రాయెల్ వైపు వెళ్లకుండా తిరిగి సౌదీ అరేబియా గగనతలంలోకి మళ్లింది. చివరికి సౌదీలోని పౌర, సైనిక స్థావరమైన తబూక్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ పరిణామాల మధ్య ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం అత్యవసరంగా స్పందించి పరిస్థితి అదుపులో ఉందని స్పష్టం చేసింది. భద్రతా అధికారులను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. టెర్రర్ అటాక్ అనుకున్న ఈ ఘటనకు అసలు కారణం ఉగ్రవాదం కాదని తేలింది. విమానంలోని ఇద్దరు పైలట్లు (పైలట్, కో-పైలట్) మధ్య కాక్‌పిట్‌లో తలెత్తిన వ్యక్తిగత ఘర్షణే అసలు కారణమని అధికారులు ధృవీకరించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానాన్ని నడిపిన కెప్టెన్ రష్యా దేశస్థుడు కాగా, కో-పైలట్ ఉక్రెయిన్ దేశస్థుడని.. వారిద్దరి మధ్య ఉన్న దేశాల ఉద్రిక్తతల ప్రభావమో లేదా వ్యక్తిగత విభేదాల కారణంగానో ఈ గొడవ జరిగిందని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు (ఛానెల్ 12 వంటివి) నివేదించాయి. ఈ భౌతిక దాడి కారణంగా ఇద్దరు పైలట్లు గాయపడి ఆసుపత్రిలో చేరినట్లు తబూక్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఎన్నికలకు ముందు శత్రు దేశాల నుంచి దాడులు జరగవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో, ఈ విమాన ఘటన కొద్దిసేపు తీవ్ర అలజడి సృష్టించింది. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పైలట్ల వ్యక్తిగత గొడవ కారణంగా ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ.. చివరికి అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ