సంక్షేమ పథకాలను ఉచితాలుగా చూడకూడదు : 'ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్'లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

الأربعاء، 30 سبتمبر 2026

held in Kochi investments made by the government to develop quality human resources Kerala Deputy CM Bhatti Vikramarka at 'India Today South Conclave' Welfare schemes should not be viewed as 'freebies'

t f B! P L

కేరళలోని కొచ్చిలో బుధవారం నిర్వహించిన 'ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్'లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై ఎన్నికల వ్యవస్థ, ఎస్‌ఐఆర్, సంక్షేమ పథకాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు, పెట్టుబడులు, కాంగ్రెస్ పార్టీతో తన అనుబంధం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తనకు ఉన్నటువంటి సంబంధాల గురించి వివరంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను 'ఫ్రీబీస్' (ఉచితాలు)గా చూడకూడదని, అవి నాణ్యమైన మానవ వనరుల తయారీకి ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడులని స్పష్టం చేశారు. పేదలకు ఇళ్లు, ఉచిత విద్య, మెరుగైన వైద్యం అందించడం ద్వారానే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని భట్టి తెలిపారు. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాష్ట్ర జీఎస్‌డీపీపై ప్రభావం చూపేలా ఉండాలన్నదే తమ విధానమని అన్నారు. వైద్యం & విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా సాంకేతిక విద్యకు పెద్దపీట వేస్తున్నామని వివరించారు. సంక్షేమం కింద మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో 53 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందన్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా ఏ ఓటర్లు ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారో ముందస్తుగా విశ్లేషించి కేంద్రీకృత పద్ధతిలో ఫారమ్-7 దరఖాస్తుల ద్వారా ప్రతిపక్ష మద్దతుదారుల పేర్లను జాబితాల నుంచి తొలగిస్తున్నారని భట్టి ఆరోపించారు. 'ఎస్‌ఐఆర్' పేరు చెప్పి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 40వేలనుండి 50వేల వరకు ఓట్లను అక్రమంగా డిలీట్ చేస్తున్నారన్నారు. తన సొంత నియోజకవర్గంతోపాటు పొన్నం ప్రభాకర్ వంటి సీనియర్ నాయకులు, పలువురు పోటీదారుల పేర్లను కూడా ఓటర్ల జాబితాలో అనుమానాస్పదంగా ఉంచారని మండిపడ్డారు. సాధారణంగా రెండు వేల నుండి పది వేల స్వల్ప ఓట్ల తేడాతో గెలుపోటములు నిర్ణయమయ్యే నియోజకవర్గాల్లో ఈ తరహా కుట్రలు ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. 'కాంగ్రెస్ గెలిచిన ప్రాంతాల్లో ఎన్నికల సంఘాన్ని ఎందుకు ప్రశ్నించరు' అన్న ప్రశ్నకు స్పందిస్తూ తమకు విపరీతమైన ప్రజాదరణ ఉన్న చోట 30వేలనుండి 40వేల ఓట్లు తొలగించినప్పటికీ మెజారిటీ తగ్గి గెలుపొందుతున్నామని భట్టి వివరించారు. రాజకీయ పార్టీలు ఓడిపోవచ్చు లేదా గెలవవచ్చు కానీ, పౌరులకు రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై విశ్వాసం సడలకుండా చూడటమే ప్రధానమని స్పష్టం చేశారు. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల్లో తాము వేసే ఓటుపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు ఆ సందేహాలను నివృత్తి చేసి పారదర్శకతను నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పైనే ఉందన్నారు. కేంద్రం క్షమాపణ చెప్పి దిగిపోవాలి. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నందుకు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఉప ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన అత్యంత ఆవశ్యకమని ఆయన ఉద్ఘాటించారు. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా చూసి, ఓటర్లలో నమ్మకాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని భట్టి స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో భాగంగా బీజేపీకి లబ్ధి చేకూర్చేలా పలువురు నేతల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు.ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని, తిరిగి బ్యాలెట్ పేపర్ల విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి గణనీయంగా ఆదాయం సమకూరుస్తున్నప్పటికీ తిరిగి వచ్చే వనరుల విషయంలో సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని భట్టి అన్నారు. జీఎస్టీ సమావేశాల్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు. జీఎస్టీ పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి రూపాయి పన్ను పంపిస్తే కేంద్ర ఇస్తున్నది 43 పైసలు మాత్రమేనని, అదే బిజెపి పాలిత రాష్ట్రమైన బీహార్ కు రెండు రూపాయల వరకు ఇస్తున్నారని ఉదాహరణగా వివరించారు. దేశాన్ని 'రాష్ట్రాల సమాఖ్య'గా గుర్తించి దేశ ఆర్థికాభివృద్ధికి రాష్ట్రాలు అందిస్తున్న సహకారాన్ని పరిగణనలోకి తీసుకుని వనరుల పంపిణీ జరగాలని కోరారు. 'డబుల్ ఇంజిన' ప్రభుత్వాలకు కేంద్రం నుంచి ఎక్కువ ప్రయోజనాలు లభిస్తున్నాయా అన్న ప్రశ్నకు అవునని సమాధానమిచ్చారు. హైదరాబాద్‌లో లభ్యమయ్యే భారీ టాలెంట్ పూల్, ప్రపంచస్థాయి మౌలిక వసతులు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఓఆర్‌ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఫైనాన్షియల్ సిటీ, హైటెక్ సిటీలు తెలంగాణకు ప్రధాన బలాలని భట్టి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతి, రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకోబోయే పాలనాపరమైన నిర్ణయాలు, పెట్టుబడులకు తెలంగాణ ఏ విధంగా అనుకూలమైన ప్రాంతం అనే విషయాలను ఈ సదస్సు వేదికగా ఆయన వివరించారు

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ