రిలయన్స్ జియో వినియోగదారుల కోసం జియో పీసీ సబ్‌స్క్రిప్షన్ తీసుకువచ్చింది. ఏ టెలికాం లేదా బ్రాడ్ బ్యాండ్ ప్రొవైడర్ ఉపయోగించే వారికైనా సరే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అందించనుంది. ఈ సర్వీస్ ఇప్పటి వరకు జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండేది అయితే ఇప్పడు అందరికీ ఇది అందుబాటులోకి వచ్చింది. కొత్త హార్డ్‌వేర్ కొనకుండా పాత కంప్యూటర్ జీవితకాలాన్ని పొడగించేలా దేశవ్యాప్తంగా ఉన్న యూజర్స్ అందరికీ ఇది అందుబాటులోకి వచ్చింది. జియో పీసీ అనేది క్లౌడ్ కంప్యూటింగ్ ఎనర్జీని వినియోగదారుడి వద్ద ఇప్పటికే ఉన్న డివైజ్‌కు అందిస్తుంది. అంటే దీని ద్వారా ఫిజికల్ కంప్యూటర్ అవసరం లేకుండానే 16GB RAM , 1TB స్టోరేజ్ వరకు యాక్సెస్ పొందవచ్చు. కొత్త హార్డ్‌వేర్ కొనేందుకు లేదా అప్‌గ్రేడ్‌ల కోసం డబ్బులు చెల్లించడానికి ప్రత్యామ్నాయంగా, మూడు నుండి నాలుగు ఏళ్లు పాతవై, స్లోగా పనిచేసే, స్టోరేజీ తగ్గిపోవడం లేదా ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్ కారణంగా వెనకబడిపోయిన కంప్యూటర్స్ కోసం జియో ఈ సర్వీస్ అందిస్తోంది. జియో తెలిపిన వివరాల ప్రకారం జియో పీసీని సులభంగా 5 నిమిషాల్లో సెట్ చేసుకోవచ్చు. దీనికోసం డేటా మైగ్రేషన్ అవసరం లేదు, కొత్త హార్డ్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాల్సిన పనిలేదు, ఎలాంటి అంతరాయం లేకుండా సులభంగా సెటప్ చేసుకోవచ్చు. జియో పీసీ ప్రస్తుతం రెండు రకాల ప్లాన్స్ అందిస్తోంది. JioPC (8GB RAM, 500GB స్టోరేజీ): 2 నెలలకు రూ. 1,000, 5 నెలలకు రూ. 2,000, 10+2 నెలలకు: రూ. 4,000. JioPC Ultra (16GB RAM, 1TB స్టోరేజీ): 2 నెలలకు: రూ. 1,200, 5 నెలలకు: రూ. 2,500,10+2 నెలలు: రూ. 5,000.
ホーム
/
technology
/
జియో పీసీ సబ్‌స్క్రిప్షన్ తీసుకువచ్చిన రిలయన్స్ జియో
الخميس، 3 سبتمبر 2026
business national offers cloud computing services to anyone with an internet connection Reliance Jio Launches JioPC Subscription technology
ليست هناك تعليقات:
إرسال تعليق