సెప్టెంబర్ 18 నుంచి శాంసంగ్ గెలాక్సీ S26 FE స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ప్రారంభం

الخميس، 3 سبتمبر 2026

device have gone live on popular e-commerce platforms Samsung Galaxy S26 FE Sales to Begin on September 18 Samsung India's official website technology

t f B! P L

దేశీయ మార్కెట్లో సెప్టెంబర్ 18 నుంచి శాంసంగ్ గెలాక్సీ S26 FE స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ప్రసిద్ధ ఇ-కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు శాంసంగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్‌లు లైవ్‌లోకి వచ్చాయి. 'Notify Me' ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. శాంసంగ్ ఈవెంట్ పేజీ సమాచారం ప్రకారం ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 17 వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. లాంచ్ నోటిఫికేషన్లు, పార్ట్‌నర్ ఆఫర్ల కోసం యూజర్లు నేటి నుంచే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ UI 9, అధునాతన గెలాక్సీ AI ఫీచర్లతో రానుంది. ఈ డివైజ్‌కు ఏకంగా 7 ఏళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లు, 7 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని సమ్‌సంగ్ స్పష్టం చేసింది. ఇందులో 6.7-అంగుళాల 120 Hz AMOLED డిస్‌ప్లే, ఎగ్జినోస్ 2500 ప్రొసెసర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో సెప్టెంబర్ 4 నుంచే అందుబాటులోకి రానుండగా, భారత్‌లో మాత్రం సెప్టెంబర్ 18 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయి. శాంసంగ్ ఇండియా లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ 8 GB RAMతో పాటు 128 GB, 256 GB, 512 GB స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. బ్లూబెర్రీ, గ్రాఫైట్, పిస్తాచియో రంగుల్లో ఇది లభిస్తుంది. ఇక కెమెరా విభాగంలో.. వెనుక వైపు 50 MP ప్రైమరీ (వైడ్), 12 MP అల్ట్రావైడ్, 8 MP (3x టెలిఫోటో) త్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే 45W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,900 mAh బ్యాటరీని ఇచ్చారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ