విశాఖ రైల్వే స్టేషన్‌లో ఈ-ఫిర్యాదుల కియాస్క్ ను ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత

Saturday, September 26, 2026

Andhra Pradesh E-Complaint Kiosk at Visakhapatnam Railway Station Home Minister Vangalapudi Anitha Inaugurates Your Police - Your Friend digital e-complaint kiosk

t f B! P L

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన 'మీ పోలీస్ - మీ ఫ్రెండ్' డిజిటల్ ఈ-ఫిర్యాదుల కియాస్క్‌ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. కార్యక్రమంలో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ మంచి కార్యక్రమానికి విశాఖ వేదికగా నిలిచిందన్నారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రోజుకు సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా రైల్వే స్టేషన్‌లోనే కియాస్క్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. ఈ కియాస్క్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వాయిస్ ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ-ఫిర్యాదుల కియాస్క్‌ను *పీజీఆర్‌ఎస్‌ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ)*కు అనుసంధానం చేయడం ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారంలో పారదర్శకత, కచ్చితత్వం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నేరాల స్వభావం మారుతున్న నేపథ్యంలో ఏపీ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కేసులను ఛేదిస్తున్నారని హోంమంత్రి తెలిపారు. పారిశ్రామికంగా, పర్యాటకంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మహిళల భద్రత విషయంలో విశాఖపట్నం ముందంజలో ఉందని పేర్కొన్నారు. సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ విశాఖలో ఈ-ఫిర్యాదుల కియాస్క్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రైల్వే స్టేషన్‌తో పాటు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కూడా ఈ-ఫిర్యాదుల కియాస్క్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ప్రజలు కియాస్క్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. చదువు రాని వారు సైతం సులభంగా ఫిర్యాదు చేసేలా వాయిస్ ఆధారిత సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ