కర్నూలు ఎయిర్ పోర్ట్ లో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ ప్రారంభం

Saturday, September 26, 2026

​​Andhra Pradesh Launch of Orient Flights Aviation Academy at Kurnool Airport Union Minister of Civil Aviation Kinjarapu Rammohan Naidu

t f B! P L

ఆంధ్రప్రదేశ్‌ లోని కర్నూలు ఎయిర్ పోర్ట్ లో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌టీఓ)ను కర్నూలులో ఏర్పాటు చేయడం చారిత్రాత్మక పరిణామమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు.. కేవలం విమానాశ్రయాల నిర్మాణమే కాకుండా, శిక్షణ, నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, విమానాశ్రయ నిర్వహణ తదితర అన్ని విభాగాలతో కూడిన ఏవియేషన్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కర్నూలులో హిందుస్థాన్‌ గ్రూప్‌కు చెందిన ఓరియంట్‌ ఫ్లయింగ్‌ అకాడమీ ఎఫ్‌టీఓ ప్రారంభం కావడం రాష్ట్రంలోనే తొలి ఎఫ్‌టీఓగా ప్రత్యేకత సంతరించుకుందని పేర్కొన్నారు. దేశీయ విమానయాన రంగంలో గణనీయమైన వృద్ధి సాధించామని మంత్రి పేర్కొన్నారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య సుమారు 166కు చేరిందన్నారు. విమానాశ్రయాలు, విమానాలు, విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ విస్తరిస్తున్న ఏవియేషన్ రంగానికి అవసరమైన మానవ వనరులను సిద్ధం చేయడంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల పాత్ర కీలకమన్నారు.. దేశవ్యాప్తంగా ఎఫ్‌టీఓల సంఖ్యను, సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. కర్నూలు ప్రాంతానికి వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉందని మంత్రి తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సమీపంలో ఉండటం వల్ల కర్నూలు ఏవియేషన్ కార్యకలాపాలకు అనుకూలమైన ప్రాంతమన్నారు. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న విమానాశ్రయం ఉండటం ఎఫ్‌టీఓకు అదనపు ప్రయోజనమని మంత్రి తెలిపారు. దేశంలోని కొన్ని ఎఫ్‌టీఓలు పరిమిత సౌకర్యాలు కలిగిన చిన్న ల్యాండింగ్ స్ట్రిప్‌లపై ఆధారపడుతున్నాయని, కర్నూలులో మాత్రం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విమానాశ్రయంతో పాటు ఎఫ్‌టీఓ కూడా అందుబాటులోకి రావడం శిక్షణ పొందే వారికి ఎంతో ప్రయోజనకరమన్నారు..కర్నూలులో ఏడాది పొడవునా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉండటం వల్ల పైలట్ శిక్షణకు మరింత అనుకూలత ఏర్పడుతుందని మంత్రి పేర్కొన్నారు.. కర్నూలులో ఏర్పాటు చేసిన ఎఫ్టీఓఅభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఎఫ్టీఓలో మూడు విమానాలు ఉన్నాయని, వీలైనంత త్వరగా వాటి సంఖ్యను 10కి పెంచి, కర్నూలును దేశంలోని బలమైన విమానయాన హబ్‌లలో ఒకటిగా తీర్చిదిద్దాలని మంత్రి ఆకాంక్షించారు. కర్నూలు విమానాశ్రయం రాయలసీమ ప్రాంతంలో అనేక అభివృద్ధి అవకాశాలకు దోహదపడుతోందన్నారు. కర్నూలు కేంద్రంగా పారిశ్రామిక, తయారీ, ఏవియేషన్ రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. కియా మాన్యుఫాక్చరింగ్ యూనిట్, బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్, డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ తదితర సంస్థల కార్యకలాపాలతో పాటు ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ కూడా రావడం ద్వారా రాయలసీమలో విస్తృతమైన ఎకోసిస్టమ్ ఏర్పడుతోందన్నారు.. కర్నూలులో ఎఫ్‌టీఓ ద్వారా ఏడాదికి 60 మందికి శిక్షణ అందించే సామర్థ్యం ఏర్పడటంతో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, గ్రౌండ్ ఆపరేషన్స్, ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. కర్నూలులో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీ గురించి మంత్రి మాట్లాడుతూ, భవిష్యత్తులో డ్రోన్ల వినియోగం మరింత విస్తరించనుందని మంత్రి తెలిపారు. రక్షణ రంగంతో పాటు వ్యవసాయం, వాణిజ్యం, శాంతిభద్రతలు, భూ సర్వేలు, గ్రౌండ్ సర్వైలెన్స్ తదితర అనేక రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతోందన్నారు.. కర్నూలులో డ్రోన్ సిటీకి అనుగుణంగా డీజీసీఏ కార్యకలాపాలను మరింత విస్తరించాలన్న రాష్ట్ర మంత్రి టి.జి.భరత్ విజ్ఞప్తిపై స్పందిస్తూ, కర్నూలులో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి డ్రోన్ల నాణ్యతా పరీక్షలు, ధృవీకరణ వంటి కార్యకలాపాలను స్థానికంగానే నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ