కేంద్ర మంత్రులు చింతన్ శివిర్ (ఆత్మ పరిశీలన) పేరుతో రేపటి నుంచి రెండు రోజుల పాటు ప్రత్యేకంగా భేటీ అయి పలు అంశాలపై చర్చించబోతున్నారు. కేబినెట్ ప్రక్షాళన ప్రచారం వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పైకి వికసిత్ భారత్-2047పై దృష్టి సారించేందుకు ఈ చింతన్ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ సమావేశం కేంద్ర మంత్రిమండలి అధికారిక సమావేశం. ఈ భేటీలో ఇప్పటివరకూ చోటు చేసుకున్న పరిణామాలు, పనితీరు సమీక్ష, భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడం, ప్రభుత్వవ్యాప్తంగా జరుగుతున్న పనులను సమీక్షించడం, అలాగే వికసిత్ భారత్ 2047 దిశగా తదుపరి ఆలోచనలు, సంస్కరణలు, ప్రాధాన్యతలను గుర్తించడంపై దృష్టి సారిస్తుందని చెప్తున్నారు. వికసిత్ భారత్ కార్యక్రమం 2021 నుండి కొనసాగుతోంది. విజన్-2047, దాని స్వల్పకాలిక, దీర్ఘకాలిక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడానికి రంగాల వారీగా పది కార్యదర్శుల బృందాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం విస్తృత స్థాయిలో భాగస్వాములను కూడా సంప్రదించారు. అప్పటి నుండి వికసిత్ భారత్-2047 లోని వివిధ అంశాలపై కేంద్ర కేబినెట్ ముందు 8 ప్రజెంటేషన్లు, చర్చలు జరిగాయి. ప్రస్తుత చింతన్ శిబిరం ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తుందని చెప్తున్నారు. సంస్కరణలు, జీవన సౌలభ్యం, నిబంధనల తగ్గింపు , ఇతర పాలనా ప్రాధాన్యతలతో సహా కార్యదర్శుల బృందాలు, మంత్రిత్వ శాఖలు, విభాగాలు, క్యాబినెట్ సెక్రటేరియట్, నీతి ఆయోగ్ చేస్తున్న పనులను ఇది ఏకతాటిపైకి తెస్తుందని అంచనా. ఇది కేవలం ఒక ఏకాంత చింతన్ శిబిరం కాదని, సెప్టెంబర్ 23 , 24 తేదీలలో జరిగిన 2 విడతల చర్చల తర్వాత, రాబోయే రోజుల్లో మరిన్ని విడతలు కూడా జరగనున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
రేపటి నుంచి రెండు రోజుల పాటు చింతన్ శివిర్ పేరుతో కేంద్ర కేబినెట్ భేటీ
Tuesday, September 22, 2026
Government sources state that the primary focus of this camp is 'Viksit Bharat 2047 national Union Cabinet to Hold Two-Day 'Chintan Shivir' Starting Tomorrow
No comments:
Post a Comment