టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో అరుదైన ఘనత సాధించిన మలయాళ సినిమా 'హాఫ్'

Monday, September 21, 2026

cinema Directed by Samjad P.S kerala Malayalam Film 'Haaf' Achieves a Rare Feat at the Toronto International Film Festival national

t f B! P L

టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లోని ప్రతిష్ఠాత్మక మిడ్‌నైట్ మ్యాడ్‌నెస్ విభాగంలోకి మలయాళ సినిమా 'హాఫ్' ఘనంగా అడుగుపెట్టింది. సమ్జాద్ పి.ఎస్. దర్శకత్వం వహించిన 'హాఫ్' ఈ విభాగంలో ప్రదర్శితమైన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. చిత్ర ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఫ్రాగ్రంట్ నేచర్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆన్ సజీవ్, పి.కె. సజీవ్ నిర్మించిన 'హాఫ్'.. రా, డిస్టింక్టివ్, ఇమ్మర్సివ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా ప్రదర్శన సమయంలో పలు సందర్భాల్లో థియేటర్ మొత్తం చప్పట్లతో మార్మోగింది. చిత్రంలోని ఇంటెన్స్ వరల్డ్, డిఫరెంట్ ప్రజెంటేషన్ ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది. దర్శకుడు సమ్జాద్, నిర్మాతలు ఆన్ సజీవ్, పి.కె. సజీవ్, లీడ్ యాక్టర్స్ రంజిత్ సజీవ్, ఐశ్వర్య రాజ్, మ్యూజిక్ కంపోజర్ మిథున్ ముకుందన్, సౌండ్ డిజైనర్ విష్ణు గోవింద్ పాల్గొన్నారు. సినిమా థీమ్, మేకింగ్, విజువల్ లాంగ్వేజ్, మ్యూజిక్, సౌండ్ డిజైన్, పెర్ఫార్మెన్స్ తదితర అంశాలపై వారు ప్రేక్షకులతో ఆసక్తికరంగా మాట్లాడారు. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ప్రేక్షకుల మధ్య ప్రధాన చర్చగా మారాయి. ముఖ్యంగా వెరీ ట్రై యులిస్మాన్ రూపొందించిన ఫైట్ కొరియోగ్రఫీ ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. చిత్రంలోని మ్యూజిక్, సౌండ్ డిజైన్ కూడా దాని ఇంటెన్స్ అట్మాస్ఫియర్, ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత పెంచాయని ప్రేక్షకులు ప్రశంసించారు. 'హాఫ్'లోని రా, డిస్టింక్టివ్ విజువల్ లాంగ్వేజ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న అంశాల్లో ఒకటిగా నిలిచింది. పప్పిను సినిమాటోగ్రఫీ చిత్ర ప్రపంచాన్ని, కథాంశాన్ని అద్భుతంగా సపోర్ట్ చేయగా.. మహేష్ భువనేంద్ ఎడిటింగ్, విష్ణు గోవింద్ సౌండ్ డిజైన్ టెన్షన్, అట్మాస్ఫియర్‌ను మరింత పెంచాయి. రంజిత్ సజీవ్, ఐశ్వర్య రాజ్ పెర్ఫార్మెన్స్ కూడా Q&Aలో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చింది. ప్రేక్షకులు వారి క్యారెక్టర్స్, పెర్ఫార్మెన్స్ గురించి నటీనటులతో నేరుగా మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో 'హాఫ్' జర్నీకి గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్స్ మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఏఏ ఫిల్మ్స్ నార్త్ ఇండియా అంతటా 'హాఫ్'ను ప్రజెంట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయనున్నాయి. ఇక చిత్రానికి సంబంధించిన ఇంటర్నేషనల్ సేల్స్ రైట్స్‌ను బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్ సొంతం చేసుకుంది. యూరోపియన్ సేల్స్ ఏజెంట్‌తో ఏర్పడిన ఈ భాగస్వామ్యం అంతర్జాతీయ ప్రేక్షకుల దిశగా 'హాఫ్' ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. చారిత్రాత్మక మిడ్‌నైట్ మ్యాడ్‌నెస్ స్క్రీనింగ్, టొరంటో ప్రేక్షకుల నుంచి లభించిన బలమైన స్పందనతో 'హాఫ్' అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ సర్క్యూట్‌లో మలయాళ సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొస్తోంది. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ