ఐఐటీ బాంబేలో సాహిల్ అనే విద్యార్థి ఇటీవల జరిగిన పరీక్షలో చాట్ జీపీటీ వాడుతూ మొబైల్ తో దొరికిపోయాడు. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ బాంబే అధికారులు తెలిపిన వివరాల మేరకు ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో సెకండియర్ చదువుతోన్న సాహిల్ (19) అనే యువకుడు ఇటీవల పరీక్ష హాల్లో మొబైల్తో దొరికిపోయాడు. ప్రశ్నపత్రాన్ని చాట్జీపీటీలో అప్లోడ్ చేస్తూ ఇన్విజిలేటర్కు దొరికిపోయాడు. ఇందుకు గానూ అధికారులు అతడిపై క్రమశిక్షణా చర్యలు ఏం తీసుకోలేదు. అయితే డిపార్ట్మెంట్ హెడ్ సాహిల్ ను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే సాహిల్ శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఏడాది ఐఐటీ బాంబేలో ఇది నాలుగో మరణం. దీంతో నిన్న రాత్రి క్యాంపస్ లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వరుస ఆత్మహత్యలపై యాజమాన్యం సమాధానం చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో క్యాంపస్ లో పోలీసులు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ఐఐటీ బాంబే తాజాగా ప్రకటన విడుదల చేసింది. విద్యార్థి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామని పేర్కొంది. ఈ విచారకర సమయంలో మృతుడి స్నేహితులు, కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటిస్తున్నారని, ఈ ఘటనకు గల కారణాలపై సంబంధిత అధికారులతో దర్యాప్తు చేస్తున్నామని విద్యాసంస్థ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన పరిస్థితులపై ఐఐటీ బాంబే వాస్తవాలు చెప్పడంలేదని నిరసన చేస్తున్న విద్యార్థులు ఆరోపించారు. మోసానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని ఏడాది పాటు సస్పెండ్ చేస్తామని బెదిరించినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ సస్పెండ్ చేస్తే, ఆ విద్యార్థి హాస్టల్ ఖాళీ చేసి క్యాంపస్ బయట నివసించాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థుల ప్రకారం, ఈ చర్యల వల్ల విద్యార్థి ఇంజినీరింగ్ కోర్సు నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉండేది. క్రమశిక్షణ చర్యలకు భయపడి, ఒత్తిడి కారణంగానే విద్యార్థి ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్లు నిరసన చేస్తున్న విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులకు, యాజమాన్యానికి మధ్య చర్చలు జరుగుతుండగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు క్యాంపస్ లో భారీగా బలగాలను మోహరించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఐఐటీ పవాయ్ క్యాంపస్ లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీని తరువాత, కొంతమంది ఐఐటీ విద్యార్థులు తమ డిమాండ్ల కోసం నిరసన చేపట్టారు. ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఐఐటీ యాజమాన్యం వారితో చర్చలు జరుపుతోంది" అని డీసీపీ తెలిపారు.
ఐఐటీ బాంబే ఎగ్జామ్ హాల్‌లో చాట్ జీపీటీ వాడుతూ దొరికిన విద్యార్థి ఆత్మహత్య
السبت، 19 سبتمبر 2026
Head of the Department summoned him for counseling maharashtra national Student Dies by Suicide After Being Caught Using ChatGPT in IIT Bombay Exam Hall
ليست هناك تعليقات:
إرسال تعليق