ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి ఆంక్షలు పెట్టడంతో మామను కోడలు చంపించిన సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కల్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రా నగర్ ప్రాంతం రతన్ ఆర్బిట్ అపార్ట్‌మెంట్‌లో సుబ్రత్(35), శాలు(30) అనే దంపతులు నివసిస్తున్నారు.సుబ్రత్ తండ్రి వినీత్ మనోచా(60) ప్రముఖ ఔషధ వ్యాపారం చేస్తున్నాడు. సుభ్రత్ నెల జీతం తక్కువగా ఉండడంతో కోడలు నెల ఖర్చుల కోసం పది వేల రూపాయలు మామ ఇచ్చేవాడు. కుటుంబ సభ్యుల విషయంలో కఠినంగా వ్యవహరించడంతో ఇంటి బయట సిసి కెమెరాలు అమర్చి ఎప్పుడు నిఘా పెట్టేవాడు. మామ ధోరణితో విసిగిపోయింది. దీంతో అతడు హత్య చేయాలని ఇంట్లో పని చేసే గౌతమ్‌ను సంప్రదించింది. గత శనివారం పార్టీ ఉందని ఇంటికి తాళం వేసి భర్త, పిల్లలతో కలిసి బయటకు వెళ్లింది. ఒకటి నకిలీ తాళం చెవి తయారు చేసి తన సహాయకుడు కిశోర్‌కు ఇచ్చింది. కిశోర్, గౌతమ్ తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్లి పడక గదిలో నక్కారు. రాత్రి 11 గంటల సమయంతో వినీత్ ఇంట్లోకి వచ్చాడు. ఒక్కసారిగా ఇద్దరు అతడిని కత్తులతో పొడవడంతో పాటు గొంతు కోసి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి వారు పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శాలు ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ホーム
/
Uttar Pradesh
/
ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి ఆంక్షలు పెట్టిన మామ : విసిగి మామను హత్య చేయించిన కోడలు
الأربعاء، 9 سبتمبر 2026
crime Daughter-in-law got fed up and killed uncle Kanpur Uncle put CCTV cameras in the house and imposed restrictions Uttar Pradesh
ليست هناك تعليقات:
إرسال تعليق