తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామంలోని నేషనల్ హైవే బ్రిడ్జిపై రెండు లారీలు ఒకదానికొకటి వెనుక నుంచి ఢీకొనడంతో లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న రెండు లారీలు బుధవారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో పాలెం బ్రిడ్జిపై ఒకదానికొకటి వెనుక నుంచి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. కొంతసేపటి తర్వాత డ్రైవర్‌ను సురక్షితంగా క్యాబిన్ నుంచి బయటకు తీశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కొత్తకోట ఎస్సై ఎం. విక్రమ్ తెలిపారు.
రెండు లారీలు ఒకదానికొకటి వెనుక నుంచి ఢీ : క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్
الأربعاء، 9 سبتمبر 2026
Driver Trapped in Cabin Kothakota Mandal National Highway bridge at Palem village telangana Two Lorries Collide Wanaparthy district
ليست هناك تعليقات:
إرسال تعليق