దశాబ్దం తర్వాత భారత్‌లోకి కారెఫోర్‌ ప్రవేశం : దుబాయ్‌కు చెందిన అపారెల్‌ గ్రూప్‌తో భాగస్వామ్యం

السبت، 5 سبتمبر 2026

business Carrefour Enters India After a Decade expand operations to the western part of the country by next summer national Partnership with Dubai-based Apparel Group

t f B! P L

భారత్‌ మార్కెట్లోకి రిటైల్‌ రంగ ఫ్రెంచ్‌ దిగ్గజం కారెఫోర్‌ దశాబ్దం తర్వాత ప్రవేశించింది. దుబాయ్‌కు చెందిన అపారెల్‌ గ్రూప్‌తో భాగస్వామ్యం ద్వారా స్థానికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఇక్కడ 50,000 చదరపు అడుగులలో కారెఫోర్‌ స్టోర్‌ను అపారెల్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసింది. రానున్న నాలుగు వారాల్లోగా మరో స్టార్‌ను జత చేయనున్నట్లు వెల్లడించింది. ఈ బాటలో ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో మరిన్ని స్టోర్లకు తెరతీయనున్నట్లు తెలిపింది. వచ్చే వేసవికల్లా దేశ పశ్చిమ ప్రాంతంలో కార్యకలాపాలను విస్తరించనున్నట్లు పేర్కొంది. వృద్ధికి దన్నుగా ఇతర సంస్థల కొనుగోళ్లను చేపట్టనున్నట్లు అపారెల్‌ గ్రూప్‌ తెలియజేసింది. తొలి దశ విస్తరణలో భాగంగా రానున్న ఐదేళ్లలో 50 ఫుడ్‌ అండ్‌ గ్రోసరీ స్టోర్లను తెరవనున్నట్లు తెలియజేసింది. కారెఫోర్‌ ఇంతక్రితం 2010లో క్యాష్‌ అండ్‌ క్యారీ (హోల్‌సేల్‌) బిజినెస్‌ ద్వారా దేశీయంగా కార్యకలాపాలకు తెరతీసింది. ఆపై ఆశించిన ఫలితాలు అందుకోలేకపోవడానికి తోడు విస్తరణకు వీలైన స్థానిక భాగస్వామి లభించకపోవడంతో 2014లో ఐదు స్టోర్లను మూసివేసింది. కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేసింది. కాగా ప్రస్తుతం అప్రమత్తతతో బిజినెస్‌ విస్తరణ ప్రణాళికలు అమలు చేయనున్నట్లు అపారెల్‌ గ్రూప్‌ యజమాని, చైర్మన్‌ నీలేష్‌ వేద్‌ పేర్కొన్నారు. సొంత స్టోర్లను విస్తరిస్తూనే వృద్ధిని పెంచుకునేందుకు ఇతర సంస్థలను సొంతం చేసుకునే ప్రణాళికలు అమలు చేయనున్నట్లు వివరించారు. తొలి దశలో హైపర్‌మార్కెట్‌ విధానంపై దృష్టిపెట్టి ముందుకుసాగనున్నట్లు చెప్పారు. ఇందుకు అనుగుణంగా 50,000 ఎస్‌కేయూలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ