వరంగల్లోని ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో చికిత్స పొందుతున్న రోగులపై ఉన్నట్టుండి పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ హఠాత్ పరిణామంతో వార్డులోని రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు గాయపడ్డారు. పక్షవాతం సమస్యతో బాధపడుతూ ఆరోగ్యశ్రీ వార్డులో చేరి చికిత్స పొందుతున్న రోగులతో పాటు, అక్కడ ఉన్న వారి సహాయకులు ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది, గాయపడిన వారిని వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం వారిని వేరే వార్డులోకి మార్చి, అవసరమైన వైద్య చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలు స్పందిస్తూ ప్రాథమిక వివరణ ఇచ్చాయి. పైకప్పుకు ఫాల్స్ సీలింగ్ ఉండటం, అలాగే అక్కడే ఉన్న సీలింగ్ ఫ్యాన్ వల్ల సిమెంట్ పెచ్చులు నేరుగా రోగులపై పడకుండా కొంతవరకు ఆగాయని అధికారులు తెలిపారు. దీనివల్ల పెద్ద ప్రమాదం తప్పిందని, లేకపోతే తీవ్రస్థాయిలో గాయాలయ్యే అవకాశాలు ఉండేవి అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే పాతబడిన వార్డుల భవనాలకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని రోగుల బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి ఆరోగ్యశ్రీ వార్డులో పెచ్చులు ఊడిపడ్డ భవనం పైకప్పు : ముగ్గురికి గాయాలు
الأحد، 20 سبتمبر 2026
Ceiling Plaster Falls in MGM Hospital's Arogyasri Ward shifted to another ward and are receiving necessary medical care telangana Three Injured Warangal
ليست هناك تعليقات:
إرسال تعليق