టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సబ్సిడరీ సంస్థ అయిన హైపర్‌వాల్ట్ భాగస్వామ్యంతో రూ.70,000 కోట్ల పెట్టుబడితో భారీ ఏఐ-రెడీ డేటా సెంటర్ క్యాంపస్‌ను హైదరాబాద్ పరిసరాల్లో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించి సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారులతో విస్తృతంగా చర్చించి కీలక ముందడుగు వేశారు. ఈ ప్రతిష్టాత్మక మెగా ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం దాదాపు 264 ఎకరాల స్థలాన్ని కేటాయించగా, ఏకంగా 1 గిగావాట్ సామర్థ్యంతో కూడిన అల్ట్రా-స్కేల్ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఇక్కడ నిర్మించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యున్నత సాంకేతికతతో కూడిన హై-డెన్సిటీ, లిక్విడ్-కూల్డ్ జీపీయూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఈ క్యాంపస్‌ను డిజైన్ చేస్తున్నారు. భవిష్యత్ అవసరాలకు సరిపడా ఏఐ ఫ్రాంటియర్ మోడల్ ట్రైనింగ్, అధునాతన సూపర్ కంప్యూటింగ్ ప్రాసెసింగ్ కోసం ఈ డేటా సెంటర్ అత్యంత కీలకంగా మారనుంది. ఈ భారీ ప్రాజెక్టును దశలవారీగా చేపట్టనుండగా, హైపర్‌వాల్ట్ సంస్థ తన అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి రూ.70,000 కోట్ల మేర పెట్టుబడులను దశలవారీగా పంపింగ్ చేయనుంది. ఈ భారీ పెట్టుబడి ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దీంతో పాటు డేటా సెంటర్ ఎకోసిస్టమ్‌కు అవసరమైన నెట్‌వర్కింగ్, విద్యుత్, హార్డ్‌వేర్ సంబంధిత అనుబంధ రంగాలకు సైతం భారీ ఊతం లభించనుంది. రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటీ పురోగతికి సరికొత్త గమ్యస్థానంగా హైదరాబాద్‌ను నిలబెట్టేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, నిరంతర విద్యుత్ సౌకర్యాలు, పరిశ్రమల అనుకూల పాలసీలే ఇంతటి భారీ పెట్టుబడులకు కారణమని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే గ్లోబల్ టెక్ దిగ్గజాలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్, టీసీఎస్ హైపర్‌వాల్ట్ రాకతో దక్షిణాసియాలోనే అత్యంత శక్తిమంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా క్యాపిటల్‌గా అవతరించనుందని భావిస్తున్నారు.
హైదరాబాద్ పరిసరాల్లో రూ.70 వేల కోట్ల ఏఐ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్న టీసీఎస్
السبت، 5 سبتمبر 2026
000 Crore AI Data Center Near Hyderabad Hypervolt—a subsidiary of Tata Consultancy Services TCS to Set Up ₹70 technology telangana
ليست هناك تعليقات:
إرسال تعليق