వన్‌ప్లస్ ఏస్ సిరీస్‌లో వన్‌ప్లస్ ఏస్ 7ప్రో పేరుతో మరొక అత్యంత శక్తివంతమైన మోడల్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ఫోన్‌కి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. గేమింగ్ ప్రియులు , పర్ఫామెన్స్ కోరుకునే వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ ఫోన్‌ను రూపుదిద్దినట్లు సమాచారం. లీకైన నివేదికల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5K ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేతో రాబోతోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న చాలా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో 120Hz లేదా 144Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే చూస్తుంటాం. కానీ వన్‌ప్లస్ ఇందులో ఏకంగా 185Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను చేర్చినట్లు లీక్స్ చెబుతున్నాయి. ఇది గ్రాఫిక్-హెవీ గేమ్‌లు ఆడే సమయంలో అతుకులు లేని, అత్యంత స్మూత్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఇందులో అత్యంత వేగవంతమైన Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. దీర్ఘకాలం పాటు మల్టీటాస్కింగ్, 4K వీడియో ఎడిటింగ్, హెవీ గేమింగ్ చేసినప్పటికీ ఫోన్ వేడెక్కకుండా చూసేందుకు ప్రత్యేకంగా 'యాక్టివ్ కూలింగ్ సిస్టమ్' (ఇన్-బిల్ట్ కూలింగ్ ఫ్యాన్) అమర్చినట్లు లీకైన సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే, 16GB RAM , 1TB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫోన్‌లో 200MP ప్రైమరీ మెయిన్ కెమెరా అందించబోతున్నారనే వార్త టెక్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. దీంతో పాటు 50MP సెకండరీ కెమెరా (అల్ట్రా-వైడ్/టెలిఫోటో) , సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP ఫ్రంట్ కెమెరాను అమర్చనున్నారని తెలుస్తోంది. High-Resolution ఫోటోలు , మెరుగైన నైట్ లైటింగ్ పిక్చర్స్ తీసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ホーム
/
technology
/
త్వరలో వన్‌ప్లస్ ఏస్ 7ప్రో విడుదల
الأحد، 6 سبتمبر 2026
6.78-inch 1.5K flat AMOLED display dedicated active cooling system introduce another highly powerful model OnePlus Ace 7 Pro Launching Soon technology
ليست هناك تعليقات:
إرسال تعليق