ホーム
/
technology
/
గంటకు 400 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరిగెత్తే 'CR450' రైలు : ప్రీ-సర్వీస్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న బుల్లెట్ ట్రైన్
Monday, September 21, 2026
'CR450' Train A Bullet Train Capable of Speeds Up to 400 km/h China's next-generation 'CR450' bullet train science Successfully Completes Pre-Service Trials technology
చైనాకు చెందిన అత్యాధునిక తరం 'CR450' బుల్లెట్ రైలు అత్యంత సవాల్‌తో కూడిన, ప్రమాదకరమైన ప్రీ-సర్వీస్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. పట్టాలపై గాలితో పోటీపడుతూ దూసుకెళ్లే ఈ రైలు, పరీక్షల్లో భాగంగా మొత్తం ఆరు లక్షల కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. ఈ ఆరు లక్షల కిలోమీటర్ల దూరం అనేది భూమి భూమధ్యరేఖను 15 సార్లు చుట్టుముట్టడంతో సమానం. వేగం, భద్రతకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది కొత్త 'CR450' రైలు. ఇది గంటకు 400 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరిగెడుతుంది. అయితే, టన్నుల కొద్దీ బరువున్న రైలును గంటకు 400 కి.మీ. వేగంతో నడపడం మామూలు విషయం కాదు. ఇంజనీర్లు ఈ రైలును అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అన్ని రకాల ట్రాక్‌లపై-మళ్లీ మళ్లీ పరీక్షించారు. ఈ 6 లక్షల కిలోమీటర్ల ట్రయల్స్ ఏమాత్రం చిన్న విషయం కాదు. గంటకు 400 కి.మీ. వేగంతో గాలిని చీల్చుకుంటూ దూసుకెళ్తున్నప్పుడు రైలు బ్రేకులు, మోటార్, బాడీ, చక్రాలు ఎలా పనిచేస్తాయో పరిశీలించడమే ఈ పరీక్షల ముఖ్య ఉద్దేశం. ఎలాంటి చిన్న లోపం లేకుండా ఈ కఠినమైన పరీక్షలన్నింటినీ రైలు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాతే, ఇది ప్రయాణాలకు పూర్తిగా సురక్షితమైనదిగా ప్రకటించారు. చైనా రైలు రైట్‌వర్క్ ప్రపంచంలోనే అతి పెద్దది. CR 450 రైలు బ్రేక్ వేసిన తర్వాత ఆగిపోవడానికి పట్టే దూరం చాలా తక్కువ ఉండేలా డిజైన్ చేశారు. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేయాల్సి వచ్చినా సరే, ఎలాంటి పెద్ద కుదుపులు లేకుండా ఈ రైలు చాలా తక్కువ దూరంలోనే సురక్షితంగా ఆగిపోతుంది. కృత్రిమ మేధస్సుతో సెన్సార్లతో పని చేస్తుంది. ట్రాక్‌పై ఏదైనా చిన్న లోపం లేదా ప్రమాదం కనిపిస్తే, రైలు వెంటనే స్వయంచాలకంగా వేగాన్ని తగ్గించుకుంటుంది. చైనాలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ దూరం గంటల నుంచి నిమిషాలకు తగ్గిపోతుంది. ఉదాహరణకు చైనా రాజధాని బీజింగ్ నుండి షాంఘై మధ్య దూరం సుమారు 1,300 కిలోమీటర్లు. ప్రస్తుతం ఈ ప్రయాణానికి బుల్లెట్ రైలులో నాలుగు నుండి నాలుగున్నర గంటల సమయం పడుతోంది. అయితే, CR450 రాకతో ఈ ప్రయాణ సమయం కేవలం రెండున్నర నుండి మూడు గంటలకు తగ్గిపోనుంది. రైలు లోపలి భాగం లగ్జరీ హోటల్‌ను తలపిస్తుంది. స్మార్ట్ స్క్రీన్‌లు, 5G ఇంటర్నెట్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, కాళ్లను హాయిగా చాపుకోవడానికి తగినంత స్థలం కల్పించారు. అంతేకాకుండా, అధిక వేగంలో వెళ్తున్నప్పుడు కలిగే గాలి పీడనం వల్ల ప్రయాణికుల చెవుల్లో నొప్పి లేదా అసౌకర్యం కలగకుండా, బయటి దృశ్యాలు స్పష్టంగా కనిపించే ప్రత్యేక డిజైన్‌తో కిటికీలను రూపొందించారు. చైనా తన రైల్వే నెట్‌వర్క్‌ను కేవలం 20 ఏళ్ల లో ప్రపంచం విస్తుపోయే స్థాయికి విస్తరించింది. ప్రస్తుతం చైనాలో 45,000 కిలోమీటర్లకు పైగా హైస్పీడ్ రైల్వే మార్గం ఉంది. ఇది ప్రపంచంలోని మొత్తం హైస్పీడ్ నెట్‌వర్క్‌లో సుమారు 70 శాతానికి సమానం. జపాన్ కు చెందిన 'షింకాన్సెన్' , ఫ్రాన్స్ 'TGV' బుల్లెట్ రైళ్లు ఇప్పటికీ గంటకు 300 నుండి 320 కి.మీ. వేగంతోనే నడుస్తున్నాయి. కాగా, చైనా మాత్రం ఇప్పుడు గంటకు ఏకంగా 400 కి.మీ. వేగంతో సాధారణ ప్రయాణికుల ప్రయాణానికి సిద్ధమైంది. 6 లక్షల కిలోమీటర్ల పరీక్షల ద్వారా, 'CR450' బుల్లెట్ రైలు తన సాటిలేని వేగాన్ని, భద్రతను మరోసారి నిరూపించింది. ఇప్పుడు చైనా రైల్వే అథారిటీ ఈ రైలును అధికారికంగా ఎప్పుడు ప్రారంభించనుందా అని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ అద్భుత రైలు త్వరలోనే పట్టాలపైకి దూసుకెళ్తూ, చైనా చరిత్రలోనే కాకుండా ప్రపంచ రవాణా రంగంలోనూ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టడం ఖాయం!. ఈ రైలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతోంది. ఈ ట్రయల్ రన్‌లో సీఆర్ 450 రైలు గంటకు 453 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.
No comments:
Post a Comment