నల్లకుంటలో వృద్ధురాలి ఇంట్లో చోరీ కేసు : 24 గంటల్లో ఛేదించిన పోలీసులు : కేర్ టేకర్ ను అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం

Saturday, September 26, 2026

caretaker arrested and stolen property recovered hyderabad Police solve case within 24 hours telangana Theft at elderly woman's home in Nallakunta

t f B! P L

హైదరాబాద్ లోని నల్లకుంటలో వృద్ధురాలి నుంచి రూ.42 లక్షల విలువైన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. సెప్టెంబర్ 25న స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలతో పాటు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇంట్లో ఒంటరి వృద్ధురాలి బంగారు ఆభరణాలను దొంగిలించింది కేర్ టేకరే అని పోలీసులు నిర్థారించారు. ఆధునిక సాంకేతికత సహాయంతో నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుల వద్ద నుంచి చోరీ చేసిన రూ. 40 లక్షల విలువైన 26 తులాల బంగారు ఆభరణాలు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అంబర్  పేటలోని పోలీస్ కార్యాలయంలో అదనపు డీసీపీ నర్సయ్య, ఓయూ ఏసీపీ జగన్, నల్లకుంట ఇన్స్పెక్టర్ మారుతీ ప్రసాద్ తో  కలిసి డీసీపీ రక్షితామూర్తి కేసు వివరాలు వెల్లడించారు. బుద్దన గోదావరి అనే వృద్ధురాలి పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. దీంతో న్యూనల్లకుంటలోని అపార్ట్మెంట్లో ఆమె ఒక్కరే ఉంటున్నారు. ఈ నెల 23న ఆమె స్నానానికి వెళ్లగా, ఆ ఇంట్లో పనిచేసే ప్రవీణ ఇంట్లో బీరువా తెరిచి 26 తులాల బంగారు ఆభరణాలు, రూ.25 వేల డబ్బు, మూడు  సెల్ ఫోన్లు చోరీ చేసి పరారైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితురాలు ప్రవీణను సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎల్బీ నగర్ బస్టాండ్ వద్ద శుక్రవారం అరెస్టు చేసి నిందితురాలి నుంచి 26 తులాల బంగారు ఆభరణాలు, రెండు చోరీ ఫోన్లతో పాటు మరో మొబైల్ ను  స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ నెంబర్ 288/2026, BNS 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతికతో 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులను అదనపు డీసీపీ అభినందించారు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ