కెనరా బ్యాంక్‌లో భారీ దోపిడీ : 23 కేజీల బంగారం, రూ.43 లక్షల నగదు అపహరణ
الجمعة، 25 سبتمبر 2026
23 kg of Gold and ₹43 Lakhs in Cash Stolen Golmuri area of Jamshedpur Jharkhand Major Heist at Canara Bank national
జార్ఖండ్ లోని జంషెడ్‌పూర్‌లో గోల్మురి ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. బ్యాంకులోకి తుపాకులతో వచ్చిన ఐదుగురు దుండగులు సిబ్బందిని బంధించి 23 కేజీల బంగారం, రూ.43 లక్షల నగదును తీసుకుని పరార్ అయ్యారు. బ్యాంకులో దోపిడీకి గురైన బంగారం విలువ దాదాపు రూ.33-36 కోట్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఉదయం 9.10 నుండి 10.18 గంటల మధ్య ఈ చోరీ జరిగింది. బ్యాంకులోకి ప్రవేశించిన తరవాత మొదట దుండగులు సెక్యురిటీ గార్డుపై, మరో సిబ్బందిపై దాడి చేశారు. బ్యాంకులోకి ప్రవేశించిన తరవాత తుపాకులను చూపిస్తూ ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో ఎవరూ వారిని ప్రతిఘటించే సాహసం చేయలేదు. లోపలికి ప్రవేశించిన తరవాత స్ట్రాంగ్ రూమ్ తెరవాలని బెదిరించి అందులో ఉన్న బంగారం, నగదును ఎత్తుకుపోయారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
ليست هناك تعليقات:
إرسال تعليق