ఆర్టీసీ బస్సు టైరు పంక్చర్ కావడంతో బస్సు బోల్తా : 20 మందికి తీవ్ర గాయాలు
الثلاثاء، 22 سبتمبر 2026
20 Seriously Injured Andhra Pradesh Annamayya district RTC Bus Overturns After Tire Burst Vithalam village in Valmikipuram Mandal
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విఠలం గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు టైరు పంక్చర్ కావడంతో బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లె ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మంగళవారం ఉదయం ప్రయాణికులతో తిరుపతికి బయలుదేరింది. మదనపల్లె-తిరుపతి జాతీయ రహదారిపై విఠలం గ్రామ సమీపానికి చేరుకోగానే, బస్సు టైరు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డుపైనే బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి, బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన 20 మందిని వెంటనే వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. వారిలో పరిస్థితి విషమంగా ఉన్న పలువురిని మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన బస్సును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ليست هناك تعليقات:
إرسال تعليق