చైనాలోని మోకీ వేదికగా జరిగిన పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్-2026 టోర్నమెంట్లో భారత్ చాంపియన్‌గా నిలిచింది. సౌత్ కొరియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో అన్మోల్ ఎక్కా బృందం 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి జూనియర్ హాకీ ప్రపంచప్ బెర్తును ఖరారు చేసుకుంది. వరుసగా నాలుగోసారి చాంపియన్‌గా నిలిచిన ఘనత సాధించింది. మొత్తంగా ఆరుసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా నిలిచింది. ఆసియా కప్ గ్రూప్ దశలో మూడు గెలిచి.. ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. తద్వారా టాపర్‌గా నిలిచింది. సెమీ ఫైనల్లో మలేసియాను 3-1 గోల్స్ తేడాతో ఓడించి, ఫైనల్లో సౌత్ కొరియాతో తలపడింది.
0 Comments