ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కొణార్క్’ విడుదల : సింగిల్ చార్జ్‌పై గరిష్టంగా 200 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌

الجمعة، 25 سبتمبر 2026

Ather Electric Scooter ‘Konark’ Launched automobile available six variants across the ‘Konark S’ and ‘Z’ product lines business Maximum IDC Range of 200 km on a Single Charge technology

t f B! P L

న్యూఢిల్లీలో ఏథర్ ఎనర్జీ సంస్థ నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కొణార్క్’ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది.  ఈ ఈవీ రోజు వారీ ప్రయాణాలను మరింత సులభతరం చేయడానికి అద్భుతమైన రేంజ్, కంఫర్ట్ , ఈజీ మెయింటెనెన్స్‌ను అందిస్తుంది. ఢిల్లీలో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,999గా నిర్ణయించారు. ఈ స్కూటర్ ‘కొణార్క్ ఎస్’, ‘జెడ్’ ప్రొడక్ట్ లైన్ల కింద మొత్తం 6 వేరియంట్లలో లభిస్తుంది. ఇది సింగిల్ చార్జ్‌పై గరిష్టంగా 200 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌ను ఇస్తుంది. అన్ని వేరియంట్లు ఏథర్ సంస్థకు చెందిన 6వ తరం ‘బెడ్రాక్ బ్యాటరీ’ని కలిగి ఉన్నాయి. దీనిపై ఏకంగా 10 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్లు అంటే ఏది ముందైతే అది వారంటీని అందిస్తున్నారు. అంతేకాకుండా, ఈ వారంటీ కాలం ముగిసే సమయానికి కూడా కనీసం 70 శాతం బ్యాటరీ హెల్త్ తగ్గకుండా ఉండేలా గ్యారెంటీ ఇస్తున్నారు. రైడర్ల సౌకర్యం కోసం ఇందులో అనేక అధునాతన ఫీచర్లను పొందుపరిచారు. రోడ్డు పరిస్థితులకు తగినట్లుగా బ్రేకింగ్‌ను అడ్జస్ట్ చేసే అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రిక్ బ్రేకింగ్ సిస్టమ్ (AeBS), కీ-లెస్ అనుభూతినిచ్చే మ్యాజిక్-కీ, ఆటోపప్ సీట్ ఓపెనింగ్, ఇరుకైన ప్రదేశాలలో పార్కింగ్ సులభం చేసే ఎయిర్‌వాక్ వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే.. 14-అంగుళాల ఫ్రంట్ అల్లాయ్ వీల్, 12-అంగుళాల రియర్ వీల్, 1,352 మిమీ వీల్‌బేస్ , లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్ భారతీయ రోడ్లకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో వచ్చే ఈ స్కూటర్‌ను, ఆప్షనల్ 450W ఛార్జర్ సాయంతో మరింత వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. దీని సర్వీస్ ఇంటర్వెల్ 10,000 కిలోమీటర్లు లేదా ఏడాదిగా ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వేగంగా పెరుగుతున్న ఈవీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏథర్ సంస్థ ఇప్పటికే అక్కడ 11 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు, 7 సర్వీస్ సెంటర్లు, 273 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి తన నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసింది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ