ప్లాట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ : 118 జీఓ బాధితులకు ఊరట

الجمعة، 18 سبتمبر 2026

000 square yards upon fee ₹250 per square yard Government Gives Green Signal for Plot Regularization LB Nagar constituency Relief for GO 118 Beneficiaries telangana up to 1

t f B! P L

తెలంగాణ ప్రభుత్వం ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జీఓ 118 భూముల సమస్యకు పరిష్కారం చూపింది. గత 15, 20 ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట కలిగింది. క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న వారి అర్జీలను త్వరలోనే పరిష్కరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను కూడా విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌, రాజేంద్రనగర్‌, కార్వాన్‌, నాంపల్లి, జూబ్లీహిల్స్‌, మేడ్చల్‌ తదితర నియోజకవర్గాల్లో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకుని దీర్ఘకాలంగా ఉంటున్న పేద, మధ్యతరగతి ప్రజల స్థలాలను క్రమబద్ధీకరించే ఉద్దేశంతో గతంలో ఈ జీవో 118ని తీసుకువచ్చారు. ఈ విధానం కింద 1000 చదరపు గజాల లోపు ఉన్న స్థలాలను నిర్ణీత రుసుముతో క్రమబద్ధీకరించే అవకాశం కల్పించారు. చదరపు గజానికి రూ.250 చొప్పున రుసుము చెల్లించేలా నిబంధన రూపొందించారు. అయితే, ఎన్నికల కోడ్‌, ఇతర టెక్నికల్ కారణాల వల్ల కొంతమంది లబ్ధిదారులకు సకాలంలో హక్కు పత్రాలు ఇంకా అందలేదు. ఫలితంగా జీవో 118 అమలులో జాప్యం జరిగి సమస్య కొనసాగింది. ఈ నేపథ్యంలో, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించి, లబ్ధిదారులకు హక్కు పత్రాలు జారీ చేసే ప్రక్రియపై ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ