అఫ్రోజ్‌ను ప్రివెంటివ్ డిటెన్షన్ లో ఉంచడం చట్ట నిబంధనలను ఉల్లంఘించడమే : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 10 లక్షల జరిమానా విధించిన సుప్రీంకోర్టు

الثلاثاء، 29 سبتمبر 2026

national Placing Afroz under preventive detention violated legal provisions Supreme Court imposes ₹10 lakh fine on UP Government uttarapradesh

t f B! P L

ఉత్తరప్రదేశ్ లోని సంభల్ హింసాకాండ కేసులో నిందితుడైన ముల్లా అఫ్రోజ్‌ను ప్రివెంటివ్ డిటెన్షన్ లో ఉంచడం చట్ట నిబంధనలను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అఫ్రోజ్‌ను నిర్బంధించినందుకు యూపీ ప్రభుత్వానికి రూ. 10 లక్షల భారీ జరిమానా విధించింది. పోలీసు కస్టడీలో నిందితుడు ఇచ్చినట్లుగా చెబుతున్న అంగీకార వాంగ్మూలం ఆధారంగా ఎవరిపైనా ముందస్తు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. పీడీ యాక్ట్ కింద తనను కస్టడీలోకి తీసుకోవడంపై అఫ్రోజ్ దాఖలు చేసిన పిటీషన్ ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. దీనిపై విచారణ చేపట్టడానికి నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇదివరకే వాదనలను ముగించి, తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. ఈరోజు సుప్రీంకోర్టు తన తుది తీర్పు వినిపించింది. కస్టడీలో ఉన్న సమయంలో నిందితులు ఇచ్చే వాంగ్మూలాలకు చట్టబద్ధత ఉండదని, వాటి ఆధారంగా జాతీయ భద్రతా వంటి కఠినమైన చట్టాలను ప్రయోగించడం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. పోలీసుల కథనాల ఆధారంగా ఒకరి స్వేచ్ఛను హరించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల వ్యక్తిగత హక్కులను రక్షించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందని గుర్తుచేసింది. ప్రతీకార చర్యల కోసం కఠిన చట్టాలను దుర్వినియోగం చేయకూడదని హితవు పలికింది. 2024లో సంభల్‌లోని షాహీ జామా మసీదు సర్వే జరుగుతున్న సమయంలో అక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ సర్వేకు వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉద్రిక్తతలకు ముల్లా అఫ్రోజ్ కారణం అంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు రికార్డు చేసిన వాంగ్మూలంలో తన పేరును బలవంతంగా చేర్చారని అఫ్రోజ్ ఆరోపించారు.అఫ్రోజ్ కస్టడీని సమర్థిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, సంభల్ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో వాదనలు వినిపించింది. నిందితుడు బయట ఉంటే శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ఎన్‌ఎస్‌ఏ కింద ముందస్తు నిర్బంధంలో ఉంచినట్లు తెలిపింది. జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారుల నివేదిక మేరకే పర్చడానికే ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అలహాబాద్ హైకోర్టు సైతం గతంలో అంగీకరించింది. దీంతో అఫ్రోజ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనల సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గత వాదనలను తోసిపుచ్చింది. తగిన ఆధారాలు లేకుండా అనుమానాలు, పోలీసు కస్టడీ నివేదికల ఆధారంగా ఎన్‌ఎస్‌ఏను ప్రయోగించడం ఎంత మాత్రం చట్ట సమ్మతం కాదని పునరుద్ఘాటించింది. నిర్బంధంపై గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ