సీనియర్ నటుడు, బీజేపీ నత మిథున్ చక్రవర్తి కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొంతున్నారు. మిథున్ చక్రవర్తిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి శుక్రవారం పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో మిథున్ అనారోగ్యం గురించి బయట ప్రపంచానికి తెలిసింది. ''ప్రముఖ సినీ నటుడు, బీజేపీ కేంద్ర కమిటీ సభ్యులలో ఒకరైన మిథున్ చక్రవర్తి అనారోగ్య కారణాలతో కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నేను ఈరోజు ఆయన్ను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లాను. ఆయనతో మాట్లాడి, ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను'' అని సువేందు అధికారి ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. మిథున్‌ను పరామర్శించిన తర్వాత ఆస్పత్రి వెలుపల సీఎం సువేందు మీడియాతోనూ మాట్లాడారు. గురువారం రాత్రి ఆయనకు చిన్న శస్త్రచికిత్స జరిగిందని వెల్లడించారు. తాను ఆస్పత్రిలో చేరిన విషయం బహిరంగపరచకూడదని మిథున్ అనుకున్నారని చెప్పారు. కాగా, మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకుని ఆయన అభిమానులు, శ్రేయాభిలాషులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. మిథున్ చక్రవర్తి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని టీఎంసీ ఎంపీ, సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా ఆకాంక్షించారు. పట్నాలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరిన విషయం తనకు ఇప్పుడే తెలిసిందని చెప్పారు. మిథున్ తనకు మంచి మిత్రుడని, ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
ホーム
/
West Bengala
/
మిథున్ చక్రవర్తి ఆసుపత్రిలో చేరిక : పరామర్శించిన సీఎం సువేందు అధికారి
Friday, August 7, 2026
cinema Mithun Chakraborty Hospitalized national Suvendu Adhikari Visits Him TMC MP and senior actor Shatrughan Sinha also expressed his hope for Mithun Chakraborty's speedy recovery West Bengala
No comments:
Post a Comment