జపాన్‌పైకి ఉత్తర కొరియా ఒక బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఉత్తర కొరియా తన తీర ప్రాంతం నంచి జపాన్‌పైకి ఒక మిస్సైల్‌ను పరీక్షించింది. వోన్సమ్ ప్రాంతంలోని ఉత్తర తీరం నుంచి ప్రయోగించిన ఈ మిస్సైల్ జపాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ సమీపంలో పడ్డట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది. ఆగష్టు 17 నుంచి అమెరికా-దక్షిణ కొరియాల సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. అమెరికా-దక్షిణ కొరియా ప్రతి ఏడాది వేసవిలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంటాయి. అయితే, ఈ సైనిక విన్యాసాలు తమ దేశానికి ముప్పు అని, తమపై దాడికి ముందస్తు సన్నాహకంగానే ఇవి నిర్వహిస్తున్నాయని ఉత్తర కొరియా భావిస్తోంది. అందుకే, తమ సైనిక సత్తా కూడా చాటాలనే లక్ష్యంతో ఉత్తర కొరియా తాజాగా జపాన్‌పైకి మిస్సైల్ ప్రయోగించింది. ఇది వారంలో రెండో ఘటన. ఇటీవల కూడా ఉత్తర కొరియా.. జపాన్‌పైకి దాడికి దిగింది. ఈ అంశంపై జపాన్ రక్షణ శాఖ మంత్రి షింజిరో కొయిజుమి స్పందించారు. తమ దేశంపై జరిపిన మిస్సైల్ దాడితో ఈ ప్రాంతంలో శాంతికి విఘాతం కలుగుతుందని, భద్రతకు ముప్పు ఉందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై చైనా ద్వారా దౌత్యపరంగా తమ నిరసనను తెలియజేశామని చెప్పారు. ఈ చర్య తీవ్రమైన అంశమని, జపాన్ ప్రజల భద్రతకు ముప్పు అని ఆయన అన్నారు. ఈ దాడిపై జపాన్, దక్షిణ కొరియా, అమెరికా కలిసి సంయుక్తంగా విచారణ జరుపుతున్నాయి. జపాన్ సముద్ర తీరంలో పడిన ఈ మిస్సైల్ దాడి వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి వివరాల్ని జపాన్ వెల్లడించలేదు.
జపాన్‌పైకి బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించిన ఉత్తర కొరియా
الأربعاء، 12 أغسطس 2026
international Joint military exercises between the US and South Korea are scheduled to begin on August 17 landed near Japan's Exclusive Economic Zone North Korea Launches Ballistic Missile Towards Japan
ليست هناك تعليقات:
إرسال تعليق