చెరువుల పునరుద్ధరణతో మహానగరం సరికొత్త రూపురేఖలను సంతరించుకుంటోంది !

Saturday, August 1, 2026

CM Revanth Reddy expresses satisfaction with HYDRAA's performance telangana The metropolis is taking on a new look through the restoration of lakes

t f B! P L

హైదరాబాద్ నగరంలోని చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు , జలవనరుల పునరుజ్జీవం కోసం పనిచేస్తున్న హైడ్రా వ్యవస్థ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణతో మహానగరం సరికొత్త రూపురేఖలను సంతరించుకుంటోందని, ఇది తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రధానంగా ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవనం కోసం అహర్నిశలు శ్రమించిన హైడ్రా అధికారులు , సిబ్బందిని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కబ్జాలు, వ్యర్థాలతో కళాహీనంగా మారిన చెరువులను ప్రణాళికాబద్ధంగా శుభ్రం చేసి, మళ్లీ జీవం పోస్తుండడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. భావి తరాలకు స్వచ్ఛమైన, జీవంతో నిండిన పర్యావరణాన్ని, భద్రమైన భవిష్యత్తును అంకితం చేయడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదని, రాబోయే తరాల భవిష్యత్తును భద్రపరచడమేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నగరంలో ఆక్రమణలకు గురైన ప్రతి చెరువును కాపాడుతూ, ప్రభుత్వానికి చెందిన ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ దిశగా హైడ్రా చేపడుతున్న చర్యలు నగరానికి సరికొత్త శోభను తీసుకువస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ