పులి దాడిలో పశువుల కాపరి మృతి

الأحد، 30 أغسطس 2026

154 Cantonment area in the Moharli forest zone of Chandrapur district Cattle Herder Killed in Tiger Attack maharashtra

t f B! P L

హారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా మోహర్లీ అటవీ ప్రాంతంలోని 154 కంటోన్మెంట్‌ పరిధిలో పులి విరుచుకుపడింది. జునోనా గ్రామానికి చెందిన విజయ్‌ మధుకర్‌ మేశ్రామ్‌ (25)పై పులి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం విజయ్‌ పశువులను మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లారు. అదే సమయంలో పొదల్లో మాటువేసి ఉన్న పులి ఒక్కసారిగా విజయ్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. పులి దాడిలో తీవ్రంగా గాయపడిన విజయ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గురించి సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు పులి సంచారాన్ని గుర్తించేందుకు అటవీశాఖ అప్రమత్తమైంది. పులి కదలికలను పర్యవేక్షించేందుకు కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు. పులి ఏ ప్రాంతంలో సంచరిస్తోంది? అదే పులి గతంలోనూ గ్రామ పరిసరాల్లో కనిపించిందా? అనే కోణాల్లో అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ