కృత్రిమ మేధ ద్వారా సృష్టించే తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌లకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఐటీ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కొత్త ప్రతిపాదనలు చేసింది. ఈ కొత్త మార్పుల ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఏఐ ఆధారంగా రూపొందించిన కంటెంట్‌కు విధిగా 'AI లేబులింగ్' వేయడం తప్పనిసరి చేశారు. దీనివల్ల వినియోగదారులు ఏది నిజమైన కంటెంట్, ఏది కృత్రిమంగా సృష్టించబడింది అనేది సులభంగా గుర్తించగలిగే అవకాశం ఏర్పడనుంది. అలాగే ప్రభుత్వ లేదా కోర్టు ఉత్తర్వుల ఆధారంగా చట్టవిరుద్ధమైన లేదా హానికరమైన ఏఐ కంటెంట్‌ను తమ వేదికల నుంచి తొలగించడానికి సోషల్ మీడియా సంస్థలకు ఇప్పటివరకు ఉన్న 36 గంటల గడువును కేవలం 3 గంటలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ మాధ్యమాల్లో యూజర్ల రక్షణ, పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక చర్యలు చేపట్టింది. అలాగే సెన్సిటీవ్ విషయాలకు సంబంధిచిన ఫిర్యాదుల పరిష్కార సమయాన్ని 24 గంటల నుంచి 2 గంటలకు, ఇతర ఫిర్యాదులను 72 గంటల నుంచి 36 గంటలకు తగ్గించారు.
ఏఐ డీప్ ఫేక్ కంటెంట్ : ఐటీ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కొత్త ప్రతిపాదనలు
الخميس، 6 أغسطس 2026
AI Deepfake Content New Proposals to Further Tighten IT Rules technology Union Ministry of Electronics and Information Technology
ليست هناك تعليقات:
إرسال تعليق