ప్రమాదవశాత్తు పేలిన గ్యాస్‌ సిలిండర్‌ : ఇద్దరికి తీవ్ర గాయాలు

الاثنين، 3 أغسطس 2026

Block 83 crime Gas Cylinder Explodes Accidentally Pothana Colony in Ramagundam Quarter No. 1151 telangana Two Sustain Severe Injuries

t f B! P L

తెలంగాణ లోని రామగుండం, పోతనకాలనీ 83వ బ్లాక్‌ క్వార్టర్‌ నంబరు 1151లో ఆదివారం ప్రమాదవశాత్తు వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో సింగరేణి కార్మికుడు యాదవనేని వసంత్‌తోపాటు ఆయన భార్య విజ్ఞత తీవ్రంగా గాయపడ్డారు.  శనివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న వసంత్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. ఇదే సమయంలో ఇంట్లో నిల్వ ఉంచిన అదనపు వంటగ్యాస్‌ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ కావడంతో అది ఇంటి అంతటా వ్యాపించింది. తలుపులు, కిటికీలు మూసి ఉండటంతో గ్యాస్‌ సాంద్రత మరింత పెరిగింది. తెల్లవారుజామున గ్యాస్‌ వాసనను గుర్తించిన కుటుంబ సభ్యులు పరిస్థితిని అర్థం చేసుకునేలోపే హాల్‌లో లైట్‌ ఆన్‌ చేయడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు అలుముకోవడంతో విజ్ఞతతో పాటు బాత్‌రూమ్‌లో ఉన్న వసంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కేకలు విని స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం దంపతులను గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విజ్ఞతకు, వసంత్‌కు తీవ్ర గాయాలవ్వడం, పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బెడ్‌రూమ్‌లో ఉన్న వారి ఇద్దరు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ భారీ పేలుడు దాటికి ఇంట్లోని సామగ్రి మొత్తం కాలిబూడిదైంది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ